యోగాధ్యాయము-భావాధిపతిత్వ వశమున గ్రహఫలములు:
యోగాధ్యాయము-భావాధిపతిత్వ వశమున గ్రహఫలములు:
1. శుభగ్రహములు కేంద్రాధిపతులైన శుభఫలమును ఇవ్వరు.
2. పాపగ్రహములు కేంద్రాధిపులైన పాపఫలమును ఇవ్వరు.
3. త్రికోణాధిపతులైన గ్రహములన్నీ, శుభలైనా పాపులైనా శుభఫలములనే ఇస్తారు.
4. నైసర్గికశుభులు కేంద్రాధిపతులైన శుభఫలమును ఇవ్వరు..
5. నైసర్గికపాపులు కేంద్రాధిపతులైన పాపఫలమును ఇవ్వరు.
6. త్రికోణాధిపతులు, శుభులైనా, పాప్పులైనా శుభ ఫలములనే ఇస్తారు.
7. లగ్నము, కేంద్రము మరియు త్రికోణము కూడా అగును కనుక, లగ్నాధిపతి శుభడే.
8. పంచమ, నవమములకు విశేష ధనమని పేరు.
9. సప్తమ, దశమములకు విశేష సుఖమని పేరు.
10. తృతీయ, షష్ఠ లాభముల (3, 6, 11) కధిపతులు. శుభులైనా, పాపులైనా పాపఫలమునే ఇస్తారు.
11. ధన, అష్టమ, వ్యయాధిపతులు (2, 8, 12) సాహచర్యమున, స్థానాంతరానుగుణ్యముగాను ఫలితముల నిచ్చెదరు. అనగా ధన, అష్టమ, వ్యయాధిపతులకు ఎవరితో సంబంధముండునో దానినిబట్టియు ఫలితము నిస్తారు.
12. ధన, అష్టమ, వ్యయాధిపతులు మరొక స్థానమునకు అధిపతికూడా అవుతారు కనుక ఆ రెండవ స్థానాధిపత్యమునుబట్టి ఫలితము నిస్తారు.
13. మేషమునకు శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి. ద్వితీయాధిపత్యము మంచికాదు, చెడూకాదు. కాని సప్తమాధిపత్యము మంచిదికాదు. కనుక దానిని అసరించి, దాని కనుగుణముగా శుక్రుడు మేషలగ్నమునకు అశుభ ఫలప్రదుడే. ఇట్లే చూడవలెను.
14. కేంద్ర, త్రికోణ త్రిషడాయాధిపతుల ఒకరికంటే మరొకరు ఉత్తరోత్తరము బలవంతులు.
15. అదేవిధముగా పంచమాధిపతికన్నా నవమాధిపతి బలవంతుడు.
16. 3, 6, 11 అధిపతులు ఉత్తరోత్తరమును బలవంతులు.
17. అష్టమాధిపతి, భాగ్యమునకు వ్యయస్థానమైనందువలన అష్టమమునకు అధిపతి కావున శుభప్రదుడుకాడు. భాగ్యము మంచిది. దానికి 12వ స్థానముకదా 8. అనగా భాగ్యవ్యయము కనుక అష్టమము మంచిది కాదు.
18. అష్టమాధిపతి, 3, 6, 11భావాలకు కూడా అధిపతియైన విశేషముగా మరింత అశుభుడు.
19. అష్టమాధిపతి, లగ్న, పంచమ, నవమాధిపతియైన శుభ ఫలప్రదుడగును.
20. రవి చంద్రులకు అష్టమాధిపత్యదోషము లేదు, వీరిద్దరికి రెండవ స్థానాధిపతిత్వము లేనందున స్థాననాంతరానుగుణ్యముగా ఫలితము చెప్పుటకు వీలుకాదు. కావున వీరు పాపులే కారు.
నైసర్గిక గ్రహ శుభాశుభములు:
1. గురుశుక్రులు నైసర్గిక శుభులు.
2. చంద్రుడు మధ్యముడు; బుధుడు ఉదాసీనుడు,
3. రవి కుజశనులు నైసర్గిక పాపులు.
4. పూర్ణచంద్రుడు, బుధుడు, గురుడు, శుక్రుడు శుభులలో వీరు ఉత్తరోత్తరము అనగా ఒకరికన్నమరొకరు బలవంతులు.
5. క్షీణ, చంద్ర, రవి, శని, కుజులు పాపులలో వీరు ఉత్తరోత్తరము బలవంతులు.
6. కేంద్రాధిపత్య దోషము శుభగ్రహమునకును ఉన్న ది. ఆ దోషము చంద్ర, బుధ, గురు, శుక్రులకు ఉత్తరోత్తరము ప్రబలము.
7. లఘు పారాశరిలో కేంద్రాధిపత్య దోషస్తుబలవాన్ గురు శుక్రయోః ' అని చెప్పబడినది.
రాజయోగము:
1. కేంద్ర కోణాధిపతులు పరస్పర క్షేత్రములందున్నా రాజయోగము.
2. కేంద్ర కోణాధిపతులు ఇద్దరూ ఒకే రాశియందున్నా రాజయోగము.
3. కేంద్ర కోణాధిపతులలో ఒక్కరైనా మరొకరి రాశియందున్నా రాజయోగము.
4. కేంద్ర కోణాధిపతులలో ఒకడు మరొకనిచే పూర్ణదృష్టిచే చూడబడినా రాజయోగకారకు లగుదురు. ఈ యోగమున ప్రసిద్ధుడు కాని రాజుకాని పుట్టును.
విశేషములు:
ఒకే గ్రహము కేంద్రమునకు, కోణమునకు అధిపతియైన, అతడు కేంద్రమునగాని, కోణమునగాని విశేషముగా యోగము నిచ్చును.
పాపగ్రహములు కేంద్రాధిపులైన శుభకారు లగుదురు. ఆ శుభకారిత్వము అతడు త్రికోణాధిపతికూడ అయినప్పుడే కాని కేంద్రాధిపతి యైనంత మాత్రానకాదు. అనగా పాపగ్రహము కేంద్రకోణము అధిపతియైనప్పుడు శుభము నిచ్చును. కాని కేవలము కేంద్రాధిపతి యై నంతమాత్రాన చాలదని భావము.
కేంద్ర త్రికోణాధిపతులు, అశుభస్థానాధిపతులతో సంబంధమున్న మాత్రాన యోగము చెడును.
రాహుకేతువులు ఏయే భావములందుందురో ఏయే భావాధిపతులతో కూడియుందురో ఆయా ఫలముల నిత్తురు.
రాహు కేతువులు కేంద్రమునగాని, త్రికోణమునగాని ఉన్న , మరొక భావాధిపతి సంబంధమువలన యోగకారకు లగుదురు.
Comments
Post a Comment