నాభసయోగ ఫలము:
36. నాభసయోగ ఫలము:
నాభసయోగములు 32 కలవు. వాటి భేదములు మొత్తం 1800 అవుతాయి.
1. ఆశ్రయయోగములు 3,
2. దలయోగములు 2,
3. ఆకృతి యోగములు 20,
4. సంఖ్యాయోగములు 7 ఉన్నాయి.
నాభస యోగములు వివరణ:
1. ఆశ్రమ యోగములు3. రజ్జు, 2. ముసల, 3. నల.
2. దలయోగములు2. 1. మాల, 2. భుజంగ.
1. ఆకృతి యోగములు 20. 1. గద, 2. శకట, 3. శృంగాటక, 4. విహంగ, 5. హల, 6. వజ్ర, 7.యవ, 8. కమల, 9. వాపి, 10. యూప, 11. శర, 12. శక్తి, 13. దండ, 14. నౌకా, 15. కూట, 16. ఛత్ర, 17. ధనుస్సు, 18. అర్ధచంద్ర, 19. చక్ర, 19. 20. సముద్రయోగములు 20.
3. సంఖ్యాయోగములు 7
1.వీణా, 2. దామ, 3. పాశ,4. కేదార, 5.శూల, 6.యుగ, 7.గోల యోగములు 7.
ఇవి మొత్తము 32 నాభసయోగములు అందురు.
ఆశ్రయ యోగములు: చర, స్థిర, ద్విస్వభావ రాశులను గ్రహములు ఆశ్రయించి ఉండటాన్ని ఆశ్రయ యోగములుఅంటారు.
ఆకృతి యోగములు: గ్రహములున్న స్థితివలన ఏర్పడిన ఆకారమునుబట్టి వచ్చిన యోగములను ఆకృతి యోగములు అంటారు.
సంఖ్యాయోగములు: ఏకాదిరాశులందు గ్రహస్థితివలన వచ్చునవి సంఖ్యాయోగములు. అనగా అన్ని గ్రహములు ఒకే రాశిలో ఉన్న, లేదా రెండు రాశులలో ఉన్న, మూడు రాశులలో ఉన్న, నాలుగు రాశులలో ఉన్న, ఐదు రాశులలో ఉన్న, ఆరు రాశులలో ఉన్న, లేదా ఏడు రాశులలో అన్ని గ్రహములు ఉండటాన్ని సంఖ్యాయోగములు అంటారు. ఇవి సార్థకముగా వచ్చిన పేర్లు.
ఆశ్రయ యోగములు మూడు:
చరరాశియందు అన్ని గ్రహములు ఉన్న రజ్జుయోగము;
స్థిరరాశియందున్న ముసలయోగము;
ద్విస్వభావరాశులందున్న నలయోగము; ఈ మూడు ఆశ్రయ యోగములు.
దలయోగము(మాలా, సర్ప)
మాలాయోగము:
శుభగ్రహములన్ని మూడు కేంద్రములందు ఉండి, పాపగ్రహములు కేంద్రేతర స్థానములందున్న మాలాయోగము.
సర్పయోగము:
అన్ని పాపగ్రహములు 3 కేంద్రములందుండి, శుభగ్రహములు కేంద్రేతర స్థానములందున్న సర్పయోగము. ఈ రెంటికి దలయోగములని పేరు.
ఆకృతియోగ లక్షణము:
1. గ్రహములన్ని రెండు కేంద్రములందు ఉన్న (1-4; 4-7; 7-10; 10-1;) గదాయోగము.
2. అన్ని గ్రహములు లగ్నసప్తమములందున్న శకటయోగము.
3. అన్ని గ్రహములు చతుర్ధ దశమములందున్న విహంగయోగము.
4. అన్ని గ్రహములు త్రికోణములందు (1, 5, 9) ఉన్న శృంగాటకయోగము.
వజ్రయోగము నాలుగు విధములు:
1. అన్ని గ్రహములు 2, 6, 10లలో ఉన్న వజ్రయోగము.
2. అన్ని గ్రహములు 3.7.11లలో ఉన్న వజ్రయోగము.
3. అన్ని గ్రహములు 4, 8, 12లలో ఉన్న వజ్రయోగము.
4. అన్ని గ్రహములు చతుర్థ దశమములందు ఉన్న వజ్రయోగము.
దీనికి విపరీతముగా అనగా
1. పాపగ్రహములు లగ్న సప్తమములందు, శుభగ్రహములు, చతుర్థ దశమములందు ఉన్న యవయోగ మందురు.
2. అన్ని గ్రహములు నాలుగు కేంద్రములందు ఉన్న కమలయోగము.
3. కేంద్రములుగాక తక్కిన స్థానములందు అన్ని గ్రహములున్న వాపీయోగము.
4. లగ్నము నుండి చతుర్థమువరకు అన్ని గ్రహములు ఉన్న యూపయోగము;
5. చతుర్థమునుండి సప్తమమువరకు నాల్గు స్థానములందున్న శరయోగము;
6. సప్తమమునుండి దశమము వరకు ఉన్న శక్తియోగము.
7. దశమమునుండి లగ్నమువరకు నాలుగు స్థానము లందున్న దండయోగము.
8. లగ్నమునుండి ఏడు రాశులలో (1-7) ఉన్న నౌకాయోగము,
9. చతుర్థమునుండి ఏడురాశులలో ఉన్న కూటయోగము;
10. సప్తమము నుండి ఏడురాకులలో ఉన్న ఛత్రయోగము,
11. దశమమునుండి ఏడు రాశులలో ఉన్న చాపయోగము,
అర్ధచంద్రయోగము:
కేంద్రేతర సప్తమ స్థానములందు సప్తగ్రహములున్నచో ఎనిమిది రకముల అర్ధచంద్రయోగములు ఏర్పడును. ఎట్లనగా
1. ద్వితీయము నుండి అష్టమము వరకు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహమున్న ఒక అర్ధచంద్రయోగము.
2. తృతీయము నుండి నవమము వరకు ఉన్న రెండవ అర్ధచంద్రయోగము.
3. పంచమం నుండి ఏకాదశం వరకు ఉన్న మూడవ అర్ధచంద్రయోగము.
4. షష్ఠం నుండి ద్వాదశం వరకు ఉన్న అర్ధచంద్రయోగము.
5. అష్టమమునుండి ద్వితీయమువరకు ఉన్న అర్ధచంద్రయోగము.
6. నవమము నుండి తృతీయము వరకు ఉన్న అర్ధచంద్రయోగము.
7. ఏకాదశం నుండి పంచమం వరకు ఉన్న అర్ధచంద్రయోగము.
8. ద్వాదశం నుండి షష్ఠం వరకు ఉన్న అర్ధచంద్రయోగము.
చక్రయోగము: లగ్నమునుండి ఏకాంతరముగా (1, 3, 5, 7, 9, 11) స్థానములందు అన్ని గ్రహములు ఉన్న చక్రయోగము.
సముద్రయోగము: ద్వితీయభావము నుండి ఏకాంతరముగా (2, 4, 6, 8, 10, 12) ఉన్న సముద్రయోగము. పై ఇరువదింటికి ఆకృతియోగములని పేరు.
సంఖ్యాయోగ లక్షణములు:
1. అన్ని గ్రహములు ఒక్క రాశిలో ఉన్న గోలయోగము.
2. రెండు రాశులందున్న యుగయోగము;
3. మూడు రాశులందున్న శూలయోగము;
4. నాల్గు రాశులందున్న కేదారయోగము,
5. అయిదు రాశులందున్న పాయోగము;
6. ఆరు రాశులందున్న దామయోగము,
7. సప్తరాశులందున్న వీణాయోగము.
(వీటికన్న భిన్నమైన యోగముండదు. ఒకవేళ ఏదైనా ఉన్న పూర్వోక్తయోగమే అగును.
Comments
Post a Comment