బృహత్పరాశరహోరాశాస్త్రం (ఉత్తరభాగం)
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 78
బృహత్పరాశరహోరాశాస్త్రం (ఉత్తరభాగం)
అష్టక వర్గాధ్యాయము
1. అనేక ఆచార్యులకు సమ్మతమైన గ్రహభావఫలమును చెప్పినారు. కాని, గ్రహముల గతి సాంకర్యమువలన ఆయా గ్రహముల ఫలము నిశ్చయించుట అతి దుస్తరమైనది. ముఖ్యముగా " కలియుగమున అల్పబుద్ధులైన పాపులకు మరింత దుస్తరము. కావున, అల్పమతులకు సైతము తెలియుటకు వీలుగా శాస్త్రమును లోకయాత్ర, ఆయుర్నిర్ణయము చేయుటకు వీలుగా చెప్పబడుచున్నది'.
2. లగ్నము మొదలు వ్యయమువరకు ఉన్న పండ్రెండుభావములు సంజ్ఞానురూపమైనవి.
3. అవి శుభగ్రహయుక్తములైనా, శుభగ్రహములచే చూడబడినా, స్వక్షేత్ర, ఉచ్చరాశిగతులైనా శుభఫలము నిచ్చును.
4. అవి నీచ, శత్రుస్థాన, పాపగ్రహయుత, పాపగ్రహ దృష్టములైనా అశుభఫలము నిచ్చును.
5. ఇది సామాన్యముగా జాతక గ్రంథములలో శాస్త్రవేత్తలచే చెప్పబడినది. నేనుకూడా పూర్వాచార్యులను అనుసరించియే చెప్పినది.
6. ఆయుర్దాయము, సుఖము, దుఃఖము ఇట్టివి నిర్ణయించుటలో వశిష్ఠ, బృహస్పతివంటి వారే సమర్థులుకారు. మందబుద్దులైన మనుష్యలమాట వేరే చెప్పనేల? అందులోను, కలియుగమున అది అంత తేలిక కాదు.
7. ఫలితములు రెండు విధములు సామాన్యము, నిశ్చయము అని.
8. ఇప్పటివరకు సామాన్యాంశము చెప్పబడినది.
9. ఇప్పుడు నిశ్చయాంశము చెప్పబడుచున్నది.
10. లగ్నము, లేక, చంద్రునినుండి గ్రహముల యొక్క, ద్వాదశభావములయొక్క శుభాశుభ ఫలలులు ఏవిధముగా చెప్పబడుచున్నదో, అదేవిధముగా తక్కిన గ్రహములనుండి శుభాశుభ ఫలములుండును.
11. లగ్నము, రవ్యాది సప్తగ్రహములు మొత్తం ఎనిమిదింటి యొక్క శుభ అశుభ ఫలము తెలియవలెను. అశుభ చిహ్నముగా బిందువును, శుభసూచకముగా రేఖను వేసుకొని ఫలము చూడవలెను.
కరణము–రేఖ
12. కరణము–బిందువు; స్థానము రేఖ సమర్థకములు. స్థానము సత్ఫల సూచకము; కరణము అసత్ఫల సూచకము.
13. అష్టకవర్గులో శుభాశుభము తెలియుటకై 14 అడ్డ (దక్షిణోత్తర) రేఖలను 10 నిలువు (తూర్పు పడమర) రేఖలను గీసి, 147 గడులుకల చక్రము వేయవలెను. మొదటి గడులలో 12 భావములను వేసి, అడ్డగడులలో లగ్నమును, సప్తగ్రహములను వేయవలెను. ఆచక్ర భోక్త ప్రకారమున బిందువులను, రేఖలను వేయవలెను.
14. రేఖలవలన శుభము, బిందువులవలన అశుభఫలము తెలియును.
15. ఏగ్రహము క్రింది యే యే భావములలో బిందువులు పడునో, ఆభావములలో అష్టకవర్గు గ్రహము ఎప్పుడు వచ్చునో అప్పుడు అశుభమును, మిగిలిన భావములలో శుభము నిచ్చును.
ఉదా : సూర్యాష్టకవరులో సూర్యునికెదురుగా క్రింద 3, 5, 6,12, భావములందు బిందువులు పడును. కావున జన్మకాలిక రవి తిరిగి గోచారమున ఆయా స్థానములకెప్పుడు వచ్చునో అప్పుడు అశుభకారకుడగును.
తక్కిన 1, 2, 4, 7, 8, 9, 10, 11 భావములకు వచ్చినపుడు శుభప్రదుడగును.
రవినుండి 1, 2, 3, 8, 12 స్థానములందు 5గ్రహములు బిందుప్రదములు.
సప్తమ, చతుర్థములందు 4 గ్రహములు బిందుప్రదములు.
షష్ఠ నవమములందు3 గ్రహములు బిందుప్రదములు.
పంచమమున 6 గ్రహములు బిందుప్రదములు.
దశమమున 2 గ్రహములు బిందుప్రదములు.
ఏకాదశమున 1 గ్రహములు బిందుప్రదములు.
సూర్యాష్టకవర్గులో
1. 1, 2, 8 భావములందు లగ్న, చంద్ర, గురు, శుక్ర, బుధ ఈ గ్రహములు బిందుప్రదములు.
2. వ్యయమున రవి, కుజ, శని, చంద్ర, గురు అయిదు గ్రహములు బిందుప్రదములు.
3. చతుర్థమున బుధ, చంద్ర, శుక్ర, గురులు నాలుగు గ్రహములు బిందుప్రదములు.
4. నవమమున లగ్న, చంద్ర, శుక్రులు మూడు గ్రహములు బిందుప్రదములు.
5. షష్ఠమున రవి, కుజ, శనులు మూడు గ్రహములు బిందుప్రదములు.
6. సప్తమము లగ్న, బుధ, గురుచంద్రులు నాలుగు గ్రహములు బిందుప్రదములు.
7. లాభమున శుక్రుడును;
8. తృతీయమున రవి, శని, శుక్ర, గురు, కుజులు అయిదు గ్రహములు బిందుప్రదములు.
9. దశమమున గురు, శుక్ర గ్రహములు బిందుప్రదములు.
10. పంచమమున రవి, శని, చంద్ర, లగ్న, కుజ, శుక్ర గ్రహములు బిందుప్రదములు.
సూర్యాష్టకవర్గ బిందుప్రద చక్రము
గ్రహ రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని లగ్న సంఖ్య
1 0 0 0 0 0 5
2 0 0 0 0 0 5
3 0 0 0 0 0 5
4 0 0 0 0 4
5 0 0 0 0 0 0 6
6 0 0 0 3
7 0 0 0 0 4
8 0 0 0 0 0 5
9 0 0 0 3
10 0 0 2
11 0 1
12 0 0 0 0 0 5
విమర్శ : గ్రహముయొక్క లగ్నముయొక్క జన్మ కాలికస్థితివలన రాశిపై శుభాశుభ ప్రభానా, పడును. జన్మసనుయమున సప్తగ్రహస్థానములు, లగ్నస్థానమునకు ఈ ఎనిమిదిటికి విశేషమున్నది. ఈ ఎనిమిది స్థానములనుండి గోచార ఫల విచారము చేసిన, అది సూక్ష్మము, నన్ముదగినదికూడ అగును. ఈ దృష్టితోనే అష్టవర్గముల విచారము చేయబడుచున్నది. అష్టక వర్గులో ప్రతిగ్రహము తానున్న స్థానమునుండి ఏయే స్థానములకు బలమునిచ్చునో, అ శుభఫలదాతృత్వమును రేఖ లేక బిందువులద్వారా సంకేతము గ్రంథములందు చెప్పబడినది. గ్రంథమున రేఖలద్వారా శుభసూచకస్థానమును వ్యక్తము చేసియున్నారు. నిజానికి బిందువులకు రేఖలకు భేదమేమియులేదు. మన మెట్లు సంకేతించిన అది కొన్ని గ్రంథములలో శుభసూచన బిందువులతో జరిగిన, కొన్ని గ్రంథములలో శుభసూచన రేఖలలో జరుగును. ఉదాహరణకు: సూర్యాష్టకవరులో జన్మకాలమున రవి ఏస్థానమున ఉండెనో, స్థానమునకు 2, 4, 7, 8, 9, 10, 11 స్థానములందు శుభసూచకముగా రేఖలే ఈ గ్రంథమున ఇయ్యబడినవి. ఇది గుర్తింపదగిన విషయము. ఇది రేఖప్రద చక్రముద్వారా ముందు స్పష్టమగును.
చంద్రుని బిందు సంఖ్య బిందుప్రద గ్రహములు:
చంద్రాష్టకవర్గులో
1. 2, 9భావములందు 6గ్రహములు బిందుప్రదులు.
2. 1, 4, 8భావములందు 5గ్రహములు బిందుప్రదులు.
3. 3, 10 భావములందు 1 గ్రహము బిందుప్రదులు.
4. పంచమ భావమున 4గ్రహములు బిందుప్రదులు.
5. 6, 7 భావముల 3గ్రహములు బిందుప్రదులు.
6. వ్యయమున అన్ని (8) గ్రహములు బిందుప్రదులు.
7. లాభమున శూన్యము బిందుప్రదులు.
1. ప్రథమభావమున లగ్న, రవి, కుజ, శని, శుక్రులైదుగురు బిందుప్రదులు.
2. ద్వితీయమున లగ్న, బు, ర, చం, శ, శుక్ర 6 గ్రహములు బిందుప్రదులు.
3. 3న గురు గ్రహము బిందుప్రదుడు.
4. 4న ర, శ, చం, లగ్న, కుజులు 5గురు గ్రహములు బిందుప్రదులు.
5. 5న, చంద్ర, గురు, రవి మూడు గ్రహములు బిందుప్రదులు.
6. 6న శు, బు, గు మూడు గ్రహములు బిందుప్రదులు.
7. 7న కు, శ, ల 3న్ను;
8. 8న ల.కు, శ, శు, చం 5న్ను;
9. 9న రి, ర, కు, బు, గు 6న్ను,
10. 10న శనియు,
11. 11న ఎవ్వరును లేరు శూన్యమును;
12. 12న అందరును బిండుప్రదులు.
ఇట్టి చక్రమువలన తెలియునదేమనగా జన్మసమయమున రవి గ్రహమెక్కడున్నాడో అక్కడినుండి 1, 2, 4, 5, 9, 12 భావములకు చంద్రుడెప్పుడెప్పుడు వచ్చునో, అప్పుడెల్ల అశుభఫలము నిచ్చును. మిగిలిన భావములందు శుభఫలము నిచ్చును అని. ఈరీతిగా అన్ని గ్రహములకు లగ్నమునుండి కూడా శుభాభరూపమైన గోచారఫలము తెలియదగినది.
కుజుని బిందు సంఖ్య బిందుప్రద గ్రహములు:
భౌమాష్టకవర్గులో
1. 4, 5, 7.12 లందు 6గ్రహములు
2. 2, 9భావముల 7 గ్రహములు
3. 1, 8భావములందు 5గ్రహములు
4. తృతీయభాసమున 4గ్రహములు
5. దశమమున 3గ్రహములు
6. 6న 2గ్రహములు బిందుప్రదు లగుదురు.
7. 11న ఎవ్వరునులేరు బిందుప్రదు లగుదురు.
1. ప్రథనుభావమున ర, చం, బు, గు, శు 5న్ను,
2. 2 భావమున ల, శ, ర, చం, బు.గు.శు, 7న్ను,
3. 3న శు, కు, గు, శ 4న్ను,
4. 4న ర, చం, బు, గు, శు, ల 6న్ను,
5. 5న చం, కు, గు, శు, శ, ల 6న్ను
6. 6న కు, శ 2న్ను
7. 7న బు, చం, ర, శు, ల, గు 6న్ను,
8. అష్టమమున బు, చం, ర, ల, గు 5న్ను,
9. నవమమునర, చ, కు, బు, గు, శు, ల 7న్ను,
10. దశమమున శు, చం, బు3న్ను,
11. ఏకాదశమున ఎవ్వరును లేరు.
12. ద్వాదశమున ర, శ, దు, చం, ల, కు 6న్ను బిందుప్రదులు.
13. అనగా జన్మకుండలిలోని రవిస్థానమునుని 1, 2, 4, 7, 8, 9, 12 ఈ స్థానములందు కుజుడు గోచారమున పచ్చినపుడు అశుభప్రదుడు, మిగిలిన స్థానములందు శుభప్రదుడని అర్ధము.
బుధ బిందుసంఖ్య- బిందుప్రద గ్రహములు
1. బుధాష్టకవర్గులో 1, 2, 4, 6, 9, 10 భావములందు 3 గ్రహములు
2. 8న 2న్ను
3. 3, 7 లందు 6న్ను
4. 11 న శూన్యము
5. 5, 12 లందు 5 గ్రహములు బిందు ప్రదములు.
బుధునికి
1. ప్రథమ భానమున ర, చ, గు 3న్ను,
2. 2న గు, ర, బు, నన్ను,
3. 3న ల, ర, కు, శ, చ, గు 6న్ను,
4. చతుర్థమునబు, ర, గు 3గ్గురున్ను,
5. పంచమమున గు, కు, చం, శ, ల 5న్ను,
6. షష్టమున శు, శ, కు 3న్ను,
7. సప్తమమున బు, చం, ల, ర, శు, గు 6ను,
8. అష్టమమున బు, ర. 2న్ను,
9. నవమమున గు, చం, ల వెన్ను,
10. దశమమున ర, గు, శు 3న్ను,
11. 11న ఎవరును లేరు,
12. 12న ల, చం, కు, శ, శు 5గురున్ను బిందు ప్రదులు.
అనగా జన్మకుండలిలోని రవియున్న స్థానమునుండి 1, 2, 3, 4, 7, 8, 10 ల “లోనికెప్పుడు గోచారవశమున బుధుడు వచ్చినా అశుభుడు; తక్కిన స్థానములందు శుభుడు.
గురునకు బిందు సంఖ్య బిందుప్రద గ్రహములు
1. గురుని అష్టకవర్గులో ధన, ఆయములందు1 గ్రహము,
2. దశమమున 2,
3. ద్వాదశమమున 7,
4. షష్టనున 4, అష్టను తృతీయముల 5,
5. మిగిలిన 1, 4, 5, 7, 9 భావములందు 3 గ్రహములు బిందు ప్రదములు.
గురునకు
1. ప్రథమ భావమున, ప, చ, శ 3న్ను,
2. ద్వితీయమున ఏకాదశమున శని ఒక్కడును,
3. తృతీయమున ల, కు, చం, బు, శు 5న్ను,
4. పంచమమున, ర, కు, గు 3న్ను,
5. చతుర్థమున శు, శ, చ 3న్ను,
6. షష్ఠమున గు, కు, ర, చ4న్ను,
7. సప్తమమున బు, శు, శ 3న్ను,
8. అష్టమమునల, శ, ప, చ, బు 5న్ను,
9. నవమమున శ, కు, గు 3న్ను,
10. దశమమున చం, శ 2న్ను,
11. ద్వాదశమునర, చ, కు, బు, గుశు, ల 7న్ను బిందుప్రదములు.
శుక్రబిందుసంఖ్య బిందుప్రద గ్రహములు
శుక్రాష్టకవర్గులో
1. 5, 8, 3లందు 2 గ్రహములు,
2. లగ్న, ధన, వ్యయ, దశమములందు 5గ్రహములు,
3. సప్తమమున 8,
4. షష్ఠమున 6,
5. నవమున 1,
6. చతుర్థమున 3,
7. ఏకాదశమున ఎవ్వరును లేరు బిందుప్రదులు.
8. శుక్రునికి ప్రథమ, ద్వితీయముల ర, కు, బు, గు, శ, 5న్ను,
9. 7న అన్నియును,
10. తృతీయము న ర, గు 2న్ను,
11. పంచమమున ర, కు, 2న్ను,
12. నవమమున రవి మాత్రమును,
13. చతుర్థమున ర, బు, గు 3న్ను,
14. అష్టమమున కు, బు, 2న్ను,
15. షష్ఠమున శు, ర, చం, శ, ల, గు 6న్ను,
16. ఏకాదశమున శూన్యము ను,
17. ద్వాదశమున ల, శ, బు, శు, గు 5న్ను,
18. దశమమున ల, కు, బు, చర 5న్ను బిందుప్రదులు.
శన్యష్టకవర్గులో
1. 2, 7, 9, లందు 7 గ్రహములు,
2. 8, లగ్న, 4లందు 6 గ్రహములు,
3. 10, 3, 12లందు 4గ్రహములు,
4. షష్ఠమున ఒక్కటి,
5. పంచమమున 5న్ను బిందుప్రదులు.
6. ఏకాదశమున ఎవ్వరును లేరు,
శన్యష్టవర్గులో
1. 4, 1 భావములందు చ, కు, బు, గుకు, శ 6న్ను,
2. 2, 7 లందు చం, కు, బు, గు, శు, శ, ల 7న్ను;.
3. నవమమున ర, చ, కు, గు,శు, శ, ల 7న్ను,
4. దశమమున చం, గు, శు, శ 4న్ను,
5. తృతీయమున గు, ర, బు, శు 4న్ను,
6. ఆరింట రవి ఒక్కడున్ను,
7. ద్వాదశమున లగ్న, చం, శ, ర 4న్ను,
8. పంచమమున శు, ర, చ, బు, ల 5న్ను,
9. అష్టమమున చం, కు, గు, శు, శ, ల 6న్ను బిందుప్రదులు.
10. 11న ఎవ్వరునుకారు. పైగా అందరును రేఖాప్రదులగుదురు.
అన్ని గ్రహములకు అష్టకవర్గీయ చక్రములందు గ్రహములు బిందుప్రదములు. కాని భావములందు రేఖా ప్రదములగును. రేఫ అన్నా, స్థానమన్నా ఒకటే కదా! స్థానప్రద గ్రహములను సుబోధమునకై చెప్పబడుచున్నది.
రవ్యష్టకవర్గంలో
1. 1, 2, 8 భావములందు శని, కుజ, రవులు బిందుప్రదులు.
2. పంచమమున గురుబుధులు;
3. తృతీయమున బుధ, చంద్ర, లగ్నములు;
4. చతుర్థమున లగ్న, రవి, శని, కుజులు;
5. దశమమున లగ్న, రవి, శని, కుజ, బుధ, చంద్రులు;
6. ఏకాదశమున ర, చం, కు, బు, గు, శ, ల; 7 గురు;
7. ద్వాదశమున లగ్న, శుక్ర, బుధులు;
8. షష్టమున లగ్న, శుక్ర, బుధ, గురు, చంద్రులు;
9. సప్తమమున రవి, కుజ, శని, శుక్రులు;
10. నవమమున రవి, కుజ, శని, బు, గురులు రేఖా ప్రదులు.
చంద్రాష్టక వర్గీయ రేఖాప్రద గ్రహములు
1. ప్రథమభానమున బు, చం, గురులు;
2. 2న కుజగురులు,
3. 3న బు, ర, చం, కు, శ, ల, శుక్రులు,
4. 4న గు, బు, శుక్రులు,
5. 5న కు, బు, శుశనులు;
6. 6న ర, చం, కు, ల, శనులు;
7. 7న ర, చం, గు, బు, శుక్రులు;
8. 8న ర, బు, గురులు;
9. 9న శుక్రచంద్రులు;
10. 10న ర, కు, బు, గు, శు, ల, చంద్రులు;
11. 11న అందరును,
12. 12న ఎవరునులేరు; రేఖాశుభ ప్రదులు.
కుజాష్టక వర్గీయ రేఖాప్రద గ్రహములు :
కుజాష్టకవర్గులో
1. ప్రథమ భావమున ల, శ, కుజులు,
2. 2న కుజుడు మాత్రము
3. 3న ల, బు, చం, రవులు;
4. 4న శని, కుజులు,
5. 5న బుధసూర్యులు;
6. 6న బు, చం, గు, ర, ల, శుక్రులు;
7. 7న శని కుజులు;
8. 8న శని కుజ శుక్రులు;
9. 9న శనిమాత్రము,
10. 10న కు, ర, గు, ల, శనులు;
11. 11న అందరును,
12. 12న గురుశుక్రులు రేఖాప్రదులు.
బుధాష్టక వర్గీయ రేఖాప్రద గ్రహములు
బుధాష్టకవరులో
1. ప్రథమభావమున ల, శ, కు, శు, బుధులు,
2. 2న ల, కు, చ, శు, శనులు;
3. 3నశుక్రబుధులు;
4. 4న రి, చ, శ, శు, కుజులు;
5. 5న బు, ర, శుక్రులు;
6. 6న గు, బు, ర, ల, చంద్రులు;
7. 7న కుజ, శనులు;
8. 8న కు, శ, ల, చం, శు, గురుల;
9. 9న శ, కు, ర, బు, శుక్రులు;
10. 10న ల, శ, కు, బు, చంద్రులు;
11. 11న అందరును,
12. 12న గు, బు, రవులు, రేభాప్రదులు.
గుర్వష్టక వర్గీయ రేఖాప్రద గ్రహములు
గుర్వష్టకవర్గులో
1. ప్రథమ చతుర్థభావములందు గు, ల, కు, ర, బుధులు;
2. 2న గు, ల, కు, ర, దు, చ, శుక్రులు;
3. 3న శ, గు, రవులు;
4. 5న ను, చం, ల, బు, శనులు;
5. 6న శు, ల, బు, శనులు;
6. 7న ల, కు, గు, ర, చంద్రులు,
7. 8న గు, ర, కుజులు;
8. 9న శు, ర, ల, చం, బుధులు,
9. 10నగు, బు, కు, ర, ల, శుక్రులు;
10. 11న శని తప్ప అందరును;
11. 12న శని మాత్రమును రేఖాప్రదులు.
శుక్రాష్టక వర్గీయ రేఖాప్రద గ్రహములు
శుక్రాష్టకవర్గులో
1. ప్రథమభావమున లగ్న, శుక్రచంద్రులు;
2. 2న ల, శు, చంద్రులు;
3. 3న ల, శు, చం, బు, శ, కుజులు;
4. 4న ల, శు, చ, శ, కుజులు;
5. 5న ల, బు, చ, గు, శ, శుక్రులు;
6. 6నబుధకుజులు;
7. 7న శూన్యము;
8. 8న శు, ర, చం, గు, ల, శనులు;
9. 9న చం, కు, బు, గు, శు, శ, లలు;
10. 10న శు, గు, శనులు;
11. 11న అందరును;
12. 12న కు, చం, రపులు; వీరందరును రేఖాప్రదులు.
శన్యష్టక వర్గీయ రేఖాప్రద గ్రహములు
శన్యష్టకవర్గులో
1. ప్రథమభావమున రవి లగ్నములు;
2. 2న రవిమాత్రము; 3న ల, చం, కు, శనులు;
3. 4న లగ్నసూర్యులు;
4. 5న గు, శ, కుజులు;
5. 6న రవి తప్ప అందరును;
6. 7న రవి మాత్రము;
7. 8న రవిబుధులు;
8. 9 బుధుడుమాత్రము;
9. 10న ర, కు, ల, బుధులు;
10. 11నఅందరును;
11. 12న కు, బు, గు, శుక్రులును రేఖా ప్రదులు.
లగ్నమునుండి
1. ప్రథమ, చతుర్థభావములందు 3గ్రహములు,
2. 3న, 2న్ను,
3. ధనభావమున 5గ్రహములు;
4. 5, 8, 9, 12లందు 6గ్రహములున్ను;
5. 6, 11, 12లందు ఒక్కరుమాత్రము,
6. 7న గురుడుతప్ప తక్కిన వారందరును బిందుప్రదులు.
1. ప్రథమమున ల, ర, చంద్రులు;
2. ద్వితీయమున ల, కు, చం, ర, శనులు;
3. తృతీయమున గురుబుధులు,
4. చతుర్థమున ల, చం, కుజులు;
5. పంచమమున ల, సూ, చం, కు, బు, శనులు;
6. షష్ఠమున శుక్రమాత్రము;
7. సప్తనుమున గురుడు తప్ప అందరును;
8. అష్టమమున బుధ, శుక్ర తప్ప అందరును,
9. నననమున గురు, శుక్ర తప్ప అందరును,
10. దశమైకాదశముల శుక్రుడుమాత్రము,
11. ద్వాదశమున రవిచంద్రులు తప్ప, అందరును బిందుప్రదులు.
లగ్నాష్టకవర్గునకు బిందువులను చెప్పబడినవి.
ఇప్పుడు రేఖలను చెప్పబడుచున్నవి.
లగ్నాష్టకవరులో
1. ప్రథమభావమున శ, బు, శు, గు, కుజులున్ను;
2. ద్వితీయమునబు, గు, శుక్రులున్ను,
3. తృతీయమున బుధగురులు తప్ప అందరును;
4. చతుర్థమున ర, బు, గు, శు శనులును,
5. పంచమమున గురుశుక్రులును;
6. షష్ఠమున శుక్రుడు తప్ప అందరును,
7. సప్తమమునగురుడుమాత్రము;
8. అష్టమమున బుధ శుక్రులు;
9. నవమమున గురు శుక్రులు;
10. దశమమునఏకాదశమమున శుక్రుడు తప్ప అందరును,
11. ద్వాదశమున రవిచంద్రులును రేఖాప్రదులు.
ఈ అష్టకవర్గునుండి గ్రహముల శుభాశుభస్థాన పరిజ్ఞానమైన, జన్మకుండలిలోని గ్రహముల స్థానములనుండి అష్టకవర్గులో ఎన్ని శుభప్రదస్థానములున్నవో, వాటిలో | రేఖలు, అశుభస్థానములందు 0 బిందువులు వేసినందున శుభాశుభబోధకమైన రేఖాబిందుపూర్ణమైన గ్రహముల అష్టకవర్గు చక్రము తయారగును. అట్టి చక్రములు చూడగానే గ్రహముల శుభాశుభత్వజ్ఞానము కలుగును.
రవ్యష్టకవర్గులో రవినుండి
1. రేఖా శుభప్రదస్థానములు 1, 2, 4, 7, 8, 9, 10, 11.
మిగిలిన 3, 5, 6, 12లందు బిందువులు వేయవలెను.
2. చంద్రునినుండి 3, 6, 10, 116 రేఖలు.
3. శని, కుజులకు1, 2, 4, 7, 8, 9, 10, 11 రేఖలు;
4. బుధునినుండి 3, 5, 6, 9, 10, 11, 12 రేఖలు.
5. గురునినుండి 5, 6, 9, 11 రేఖలు.
6. శుక్రునినుండి 6, 7, 12 రేఖలు.
7. లగ్నమునుండి 3, 4, 6, 10, 11, 12 రేఖలు.
చంద్రాష్టకవర్గులో చంద్రుడు
1. లగ్నమునుండి 3, 6, 10, 11 శుభుడు;
2. రవినుండి3, 6, 7, 8, 10, 11 శుభుడు;
3. తానున్నచోటికి 1, 3, 6, 7, 10, 11. శుభుడు;
4. కుజునినుండి 2, 3, 5, 6, 9, 10, 11 శుభుడు.
5. బుధునినుండి 1, 3, 4, 5, 7, 8, 10, 11 శుభుడు.
6. గురునినుండి 1, 4, 7, 8, 10, 11, 12 శుభుడు.
7. శుక్రునినుండి 3, 4, 5, 7, 9, 10, 11 శుభుడు;
8. శనినుండి 3, 5, 6, 1 శుభుడు.
కుజాష్టకవర్గులో కుజుడు
1. లగ్నమునుండి 1, 3, 6, 10, 11లందు శుభుడు;
2. రవినుండి3, 5, 6, 10, 11న్ను,
3. చంద్రునినుండి 3, 6, 11న్ను,
4. తనున్నచోటినుండి 1, 2, 4, 7, 8, 10, 11లందును,
5. బుధునినుండి 3, 5, 6, 11 లందును,
6. గురునినుండి 6, 10, 11, 12లందును,
7. శుక్రునినుండి 6, 10, 11, 12లందును,
8. శనినుండి 1, 4, 7, 8, 9, 10, 11 లందును శుభుడు.
బుధాష్టకసర్గులో బుధుడు
1. లగ్నమునుండి 1, 2, 4, 6, 8, 10, 11 లందును,
2. రవినుండి 5, 6, 9, 11, 12లందును,
3. చంద్రునినుండి 2, 4, 6, 8, 10, 11 లందును.
4. కుజుని నుండి నీనుండి1, 2, 4, 7, 8, 9, 10, 11 లందును,
5. తననుండి 1, 3, 5, 6, 9, 10, 11, 12లందును,
6. గురునినుండి 6, 8, 11, 12లందును,
7. శుక్రునినుండి 1, 2, 3, 4, 5, 8, 9, 11 లందును శుభుడు.
గుర్వష్టకవర్గులో గురుడు
1. లగ్నమునుండి 1, 2, 4, 5, 6, 7, 9, 10, 11 లందును,
2. రవినుండి 1, 2, 3, 4, 7, 8, 9, 10, 11లందును,
3. చంద్రునినుండి 2, 7, 5, 9, 11 లందును,
4. కుజునినుండి 1, 2, 3, 4, 7, 8, 9, 10, 11 లందును,
5. బుధునినుండి 1, 2, 4, 5, 6, 9, 10, 11 లందును,
6. తననుండి 1, 2, 3, 4, 7, 8, 10, 11లందును,
7. శుక్రునినుండి 2, 5, 6, 9, 10, 11 లందును,
8. శనినుండి 3, 5, 6, 12లందును శుభుడు.
శుక్రాష్టకవరులో శుక్రుడు
1. లగ్నమునుండి 1, 2, 3, 4, 5, 8, 9, 11 లందును,
2. రవినుండి 8, 11, 12లందును,
3. చంద్రునినుండి 1, 2, 3, 4, 5, 8, 9, 11, 12లందును,
4. కుజునినుండి 3, 5, 6, 9, 11, 12 లందును,
5. బుధునినుండి 3, 5, 6, 9, 11 లందును,
6. గురునినుండి 5, 8, 9, 10, 11 లందును,
7. తననుండి 1, 2, 3, 4, 5, 6, 9, 10, 11 లందును,
8. శనినుండి 3, 4, 5, 8, 9, 10, 11 లందును శుభుడు.
శన్యష్టకవర్గులో శని
1. లగ్నమునుండి 1, 3, 4, 6, 10, 11 లందును,
2. రవినుండి 1, 2, 4, 7, 8, 10, 11 లందును,
3. చంద్రునినుండి 3, 6, 11 లందును,
4. కుజునినుండి 3, 5, 6, 10, 11, 12 లందును,
5. బుధునినుండి 6, 8, 9, 10, 11, 12లందును,
6. గురునినుండి 5, 6, 11, 12లందును,
7. శుక్రునినుండి 6, 11, 12లందును,
8. తననుండి 3, 5, 6, 11 లందును శుభుడు.
అష్టకవర్గులో ఆయా గ్రహమునకు అతనితో తక్కిన గ్రహములకు శుభమని చెప్పబడిన రాశులందు రేఖలు వేయవలెను. ఇది శుభ సూచకము. అశుభసూచకముగా మిగిలిన స్థానములందు బిందువులను వేయవలెను. ఏరాశిలోనైనా 8 మించి రావు. వచ్చినవాటిలో రేఖలనుండి బిందువులను తీసివేయగాఎన్నిరేఖలు మిగులునో 8లో అన్నవవంతు శుభమనియు, ఒకవేళ రేఖలు మిగలక బిందువులే మిగిలిన, ఎన్ని మిగిలిన 8లో అన్నవవంతు అశుభమని గుర్తించునది. శుభమున్నచోటికి గోచారవశమున ఆ గ్రహము వచ్చినపుడు శుభము చేయును. అశుభమై న చోటికి వచ్చినపుడు అశుభము చేయుననవి గుర్తెరుంగునది.
రేఖలు శుభసూచకములు :
రేఖలెన్ని ఉన్న 8లో అన్నవ వంతు శుభమున్ను, మిగిలిన భాగము అశుభమని తెలియదగినది.
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 79
త్రికోణ శోధనాధ్యాయము:
ఈరీతిగా లగ్నమునకు సప్తగ్రహములకు అష్టకవర్గువేసి, అన్ని రాశులందును త్రికోణశోధన చేయవలెను.
స్వ పంచమ నవమములు త్రికోణములు.
అవి
1. మేష, సింహ, ధనుస్సులు;
2. వృషభకన్యా మకరములు;
3. మిథున తులాకుంభములు;
4. కర్కాటక వృశ్చిక మీనములు పరస్పరము ఒకదాని కొకటి త్రికోణములగును.
మేషాదిరాశులకు క్రింద అష్టకఫలమును వ్రాయవలెను.
త్రికోణములలో తక్కువ దేనికున్నదో దానిని మూడింటిలోను తీసివేసి, శేషము వేయవలెను. ఒకవేళ త్రికోణములలో ఒకదానిలో (0) శూన్యమున్న ఆ త్రికోణమునకు శోధన అక్కరలేదు. అన్నింటిని సమముగా ఉన్న , అన్నిటికి శోధన చేయవలెను.
త్రికోణ శోధనానంతరము ఏకాధిపత్య శోధన చేయవలెను.
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 80
ఏకాధిపత్య శోధనాధ్యాయము.
త్రికోణ శోధన చేసిన తరువాత, ఏకాధిపత్య శోధన చేయవలెను. ఎట్లనగా
1. రెండు రాశులందు ఫలమున్న యెడల శోధన చేయవలెను.
2. ఏకస్వామికమైన రెండు రాశులందు త్రికోణశోధితాంకము వేరుగానున్న అప్పుడు శోధన చేయవలెను.
3. రెండును గ్రహరహితములైన, రెంటి శోధితాంకము హెచ్చుతగ్గులుగా నున్న, తక్కువదానిని రెండవదానిలో తీసివేయవలెను.
4. ఒకదానిలో సున్న, రెండవదానిలో శేషము స్వల్పసంఖ్య వచ్చును.
5. రెండును గ్రహయుక్తములైన ఏకాధిపత్యమక్కడ చేయవలెను.
6. సగ్రహరాశిఫలము నిర్గ్రహ రాశిఫలముకన్న అల్పమైన సగ్రహ రాశిఫలమును నిర్గ్రహ రాశిఫలమున తీసివేసి, సగ్రహ రాశిఫలమును ఉన్న దానినున్నట్లు ఉంచవలెను. (ఇదివరలో సున్న వచ్చెడిది.)
7. సగ్రహరాశిలో ఫలమెక్కువుండి, నిర్గ్రహరాశిలో తక్కువయైన నిర్గ్రహ రాశిఫలమును తీసివేయుట, సగ్రహరాశి ఫలమును ఉన్న దానిని ఉంచుట; రెండు నిర్గ్రహములై, రెంటిఫలములు శోధన(సున్నవేయవలెను) చేయవలెను.
8. ఒక రాశి సగ్రహమై, రెండవది నిగ్రహమై రెంటిఫలము సమమైన నిర్గ్రహ రాశి ఫలమును తీసివేసి సున్నవేయవలెను.
9. కర్కాటక, సింహ (ఒక గ్రహమునకై రాశిఫల) రాశుల ఫలమును యధావత్తుగా ఉంచవలెను.
10. ముఖ్యవిషయ మేమనగా సగ్రహరాశి బలాధికము. కావున త్రికోణ శోధితాంక శోధనము (హ్రాసము) దాని కక్కరలేదు.
11. రెండును సగ్రహములైన, వాటి ఫలములలో శోధన అక్కర్లేదు కదా! 'ఉభయోర్గ్రహ సంయుక్తా నసంశోధ్యః కదాచన' అన్నారుకదా. ఒకటి సగ్రహము ఒకటి, అగ్రహము అయిన సగ్రహ ఫలముతో సమముగా అగ్రహఫలమును శోధన చేయవలెను.
12. సగ్రహ ఫలము తక్కువ, అగ్రహ ఎక్కువ అయినప్పుడే అది సంభవము.
13. ఫలము సమనుగా ఉన్నప్పుడు సగ్రహ ఫలముంచుట, అగ్రహఫలమును తీసివేయుట జరుగును.
14. రెండును అగ్రహములైన తక్కువదాని నెక్కువదానిలో తీసివేసి, ఒకరాశిలో సున్నవేయుట జరుగును.
15. రెండు సమముగా ఉన్న రెండును సున్నలే అగును.
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 81
పిండా నయనాధ్యాయము :
అష్టకవరులో శోధితాంకమును (త్రికోణ, ఏకాధిపత్య శోధనాసిద్దమైన అంకమును) రాశిమానముచే(రాశి గుణకాంకముచే) ఆరాశియందు గ్రహమున్న ఆగ్రహమానము (గ్రహగుణకాంకము) చేతను గుణించవలెను. గుణించినవన్నిటిని కలిపిన అష్టవర్గఫలమును 'పిండము' అందురు.
1. వృషసింహములకు 10,
2. మిథున వృశ్చికములకు 8,
3. తులా మేషములకు 7,
4. మకరకన్యలకు 5,
5. తక్కిన రాశులకు రాశి సంఖ్యయు రాశి గుణకాంకము.
అదేవిధముగా గ్రహములకున్ను గుణకాంకములున్నవి.
1. గురునకు 10,
2. కుజునకు 8,
3. శుక్రునికి 7,
4. బుధునికి 5, తక్కిన రవి, చంద్ర, శనులకు 5 గుణకాంకములు. .
రాశి గుణకాంక చక్రము
రాశి మే వృష మీ కర్క సిం కన్య తు వృశ్చి ధ మ కుం మీ
గుణకము 7 10 8 4 10 5 7 8 9 5 11 12
గ్రహగుణక చక్రము:
1. గ్రహములు ర చ కు బు గు శు శ
2. గుణకములు 5 5 8 5 10 7 5
Comments
Post a Comment