అష్టకవర్గ ఫలము:
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 82
అష్టకవర్గ ఫలము:
అష్టవరులనుండి తెలియు విషయములు:
అష్టవర్గ ఫలమును సావధానముగా
1. రవికి ఆత్మస్వభావము, శక్తి, పితృసుఖ దుఃఖాది, ఫలము కావున, వాటి విచారము రవిచే చేయవలెను.
2. చంద్రునివలన మనస్సు, బుద్ధినైర్మల్యము, మాతృసుఖదుఃఖములు చెప్పవలెను.
3. కుజునివలన భ్రాతృ పరాక్రమము, గుణము, భూమి;
4. బుధునివలన వ్యాపారము, జీవిక (బ్రతుకుతెరువు), మిత్రులను;
5. గురునివలన శారీరికపుష్టి, బుద్ధి, పుత్రులు; ధనసంపత్తియు;
6. శుక్రునివలన వివాహకార్యము, భోగము, వాహనము, వేశ్యాసంసర్గము;
7. శనివలన ఆయువు. జీవనోపాయము, దుఃఖశోకాది, మహాభయము, వస్తునాశము, మరణము విచారించవలెను.
విచారణీయభావముయొక్క రేఖాసంఖ్యతో యోగసిండమును గుణించి, 27 చే భాగించగా శేషము అశ్విన్యాది నక్షత్రముతో చారవశమున శనిరాగా, తద్భావ ఫలములో హ్రాసము చేయవలెను.
రవ్యష్టకవర్గ ఫలానయము
జన్మకాలమున రవ్యధిష్ఠిత రాశినుండి నవమము పితృగృహము, రవ్యష్టక వర్గీయ తత్ స్థాన రేఖాసంఖ్యచే రవ్యష్టకవర్గీయ యోగపిండమును గుణించి, 27 చే భాగించగా, శేషము అశ్విన్యాది నక్షత్రము. ఆ నక్షత్రమునకు శని గోచారవశాత్తు వచ్చినపుడు నిస్సంశయముగా పితృకష్టము చెప్పవలెను. ఆ నక్షత్రమునకు త్రికోణ నక్షత్రము (10, 19) నకు శని వచ్చినపుడుగాని తండ్రికి, లేదా పితృసమునికి మరణమో, మహాక్లేశమో వచ్చును.
ఉదా: ఒక జాతకమున రవియున్నది మిథునము. దానికి నవమము కుంభము పితృగృహము. రవ్యష్టకవర్గీయ కుంభ రేఖాసంఖ్య 6, తో రవి స్ఫుటపిండము 150 ని గుణించి, 27 చే భాగించగా శేషము 3. దానితో సమమైన అశ్విన్యాది నక్షత్రము=కృత్తిక; దానికి త్రికోణనక్షత్రములు ఉత్తర, ఉత్తరాషాఢ, వాటిలోనికి శని గోచారమున వచ్చునపుడు పితృమరణము, పితృతుల్యకష్టము కలుగుననవలెను.
ప్రకారాంతరము
లేదా, రవి స్ఫుటపిండమును పితృగృహెూత్థ అష్టవర్గీయ రేఖాసంఖ్యచే గుణించి. 12చే భాగించిన, శేషతుల్యమైన మేషాదిరాశికిగాని, దానికి పంచమ, నవమరాశికి శని వచ్చినపుడు పితృకష్టము చెప్పదగినది. అరిష్టప్రద, దశాకాలమైన మృత్యువు తప్పదు.
ఉదా: కుండలిలో రవి మిథునమున ఉన్నాడు. దానికి నవమము కుంభము. కుంభరేఖసంఖ్య 6. స్ఫుటపిండము 150×6=300÷12=25 -0 శేషము. మీనము. దానికి త్రికోణములు, కర్క, వృశ్చికములు, అక్కడికి శని వచ్చునప్పుడు పితృమరణము. (పైన చెప్పిన త్రికోణరాశికి శని వచ్చినపుడు) రవికి చతుర్థమున రాహువు, శనికాని కుజుడుగాని యుండి, గురుశుక్రుల దృష్టి లేకున్న, అతడు పితృహీనుడగును. లగ్నమునకు లేక చంద్రునికి నవమమునకు శని లేక గురుడు వచ్చి, పాప గ్రహదృష్టికాని, యుతికాని యున్న, సుఖాధిపునికి అరిష్టకాలమైన పితృమరణము చెప్పఅగును.
పితృకర్మయోగము
తండ్రియొక్క జన్మలగ్నమునకు అష్టమరాశి జన్మలగ్నమైనా, లేదా తండ్రి జన్మ లగ్నానికి అష్టమాధిపతి లగ్నమందున్నా, ఆబాలుని తండ్రి మరణించును. అతడే పితృకర్మ చేయును.
పితృ సుఖయోగము
సుఖాధిపతి జన్మలగ్నమున, చంద్రలగ్నమునుండి లగ్న ఏకాదశముల ఉన్న , లేదా, అతడు దశమ స్థానగతుడైనా జాతకుడు తండ్రి చెప్పినట్లు వినువాడగును. తండ్రికి జన్మలగ్నమునకు, జన్మరాశికి తృతీయలగ్నమునకాని తృతీయ రాశియందు జన్మించిన జాతకుడు పితృధనమును అనుభవించువాడగును.
తండ్రియొక్క జన్మలగ్నము జన్మ రాశికి దశమమున జన్మించినవాడు తండ్రితో సమమైన గుణవంతుడగును. జాతకుని దశామాధిపతి వానికి జన్మ లగ్నస్థుడైన జాతకుడు తండ్రికన్న ఎక్కువ గుణవంతుడగును.
విశేష ఫలము
రవ్యష్టకవర్గులో ఏరాశి శూన్యమో ఆ మాసమున (ఆ రాశికి వచ్చినపుడు) లేక ఆ వత్సరమున, వివాహాది శుభకార్యము చేయరాదు.
ఏరాశియందధిక రేఖలుండునో, ఆ మాసమున, ఆ సంత్సరమున అశుభమైనా రవి, గురులున్నచో శుభకార్యము చేయుట ప్రశస్తము.
చంద్రాష్టకవర్గ ఫలము
అదేవిధముగా చంద్రాష్టకవర్గులో ఏ రాశిలో సున్న ఉండునో, ఆ రాశికి చంద్రుడు వచ్చినపుడు శుభకార్యము చేయరాదు.
చంద్రునికి చతుర్థమునుండి తల్లి, భవనము, గ్రామవిచారము చేయవలెను.
చంద్రునికి చతుర్థ భావ రేఖాసంఖ్యచే చంద్రాష్టక వర్గపిండమును గుణించి, నక్షత్రసంఖ్య (27)చే భాగించవలెను. శేష నక్షత్రమునగాని, దానికి త్రికోణ (10, 19) నక్షత్రమునకుగాని చారవశమున శని వచ్చినపుడు తల్లికి మరణముగాని, కష్టముగాని కలుగును.
రేఖసంఖ్యచే పిండమును గుణించి, 12చే భాగించగా శేషమైన రాశికి శని వచ్చినపుడు మాతృమరణము లేక మాతృకష్టము చెప్పవలెను.
మాతృకష్ట విచారమునకు చంద్రాష్టక వర్గీయ త్రికోణ, ఏకాధిపత్య శోధన చేసి. స్ఫుటపిండానయనము ఆవశ్యకము. తర్వాత 'చంద్రాత్సుఖఫలాత్పిండం వర్థయే ద్విహ రేచ్ఛుభైః' అన్న పదానుసారము ఏ నక్షత్రము, ఏ రాశికి శని వచ్చునప్పటికి మాతృకష్టము కల్గునో చెప్పుట సాధ్యమగును. కావున, చంద్రాష్టకవర్గీయ త్రికోణ ఏకాధిపత్య శోధన చేయవలెను.
చంద్రాష్టక వర్గీయ త్రికోణైకాధిపత్య శోధన:
ధనుస్సు శోధితాంకము 2×9=18, మ 1×5=5; మీ. 2×12=24;సిం 1×10=10; కన్య 3×5=15; తులకి 1×7=7; -- 18+5+24+10+15+7 = 79. రాశిపిండము.
చం. 5×9=45: గ్రహిపిండము. 79+45=124.
ఉదా: చంద్ర చతుర్థభావ మీన రేఖసంఖ్య 6చే చంద్రాష్టకవర్గపిండము 124×6=గుణించగా=744÷27=27 శేషము. హస్తనక్షత్రమునకుగాని, త్రికోణనక్షత్రము, శ్రవణమునకుగాని, రోహిణికిగాని శని వచ్చినపుడు మాతృకష్టము చెప్పవలెను. లేదా124×6=744÷ 62- 0 శేషము. వృశ్చికమునకు శని వచ్చినపుడుగాని మాతృకష్టము కలుగును.
కుజాష్టక వర్గఫలము
భౌమాష్టవర్గమున సోదరులు; విక్రమము, ధైర్యము, విచారము చేయవలెను. కుజాశ్రితరాశికి తృతీయరాశి భ్రాతృగృహమగును. త్రికోణ శోధనచేసిన తరువాత ఏ రాశియందధిక ఫలముండునో ఆ రాశికి కుజుడు వచ్చినపుడు, భార్య, భూమి, సోదరులకు అభివృద్ధి యుండును. కుజుడు బలహీనుడైన సోదరుడు దీర్ఘాయువగును. ఏ రాశియందు ఫలము శూన్యమో, ఆరాశికి కుజుడు వచ్చినపుడు భ్రాతృకష్టము కల్గును.
పిండమును కుజుడున్న రాశికి తృతీయరాశి రేఖాసంఖ్యచే గుణించి, ఫలమును 27 చే భాగించగా, శేషాంకతుల్యనక్షత్రముగాని, దానికి 10, 19 (త్రికోణ) నక్షత్రమునకుగాని, లేదా గుణించిన ఫలమును 12చే భాగించగా వచ్చిన శేషాంకతుల్య రాశికి, దాని త్రికోణరాశికి శని వచ్చినపుడు భ్రాతృకష్టము చెప్పవలెను.
భౌమాష్టకవర్గీయ త్రికోణెకాధిపత్య శోధన
ఉదా: కుజాధిష్ఠితరాశి మేషమునకు మూడవరాశి, మిథున రేఖసంఖ్య 3చే గుణించి, 27 చే భాగించగా 343×3=1029÷ 27 =38- 3శే. కృత్తిక, దానికి 10వది హస్త; 19వది శ్రవణం. ఆ నక్షత్రములకు శని వచ్చినపుడుగాని, లేదా 343 ÷ 12=9శేషం. ధనుస్సునకు గాని, దానికి త్రికోణములైన మేష, సింహములకు శని వచ్చినపుడు భ్రాతృకష్టము చెప్పవలెను.
బుధాష్టకవర్గ ఫలము
బుధాధిష్ఠిత రాశినుండి చతుర్థమువలన కుటుంబము, మిత్రుడు, మేనమామ వీరి శుభాశుభ విచారణ చేయవలెను. ఏరాశిలో అధిక రేఖలుండునో ఆ రాశికి బుధుడు వచ్చినపుడు కుటుంబాదులకు శుభఫలము చెప్పవలెను. బుధాష్టవకవర్గును ఏకాధిపత్య శోధన చేసి, పిండమును, దాని చతుర్థరాశి రేఖాసంఖ్యచే గుణించి, లబ్దిని 27 చే భాగించగా శేషసంఖ్యామితమైన నక్షత్రమునకు, దాని త్రికోణ (10, 19) నక్షత్రమునకు శని వచ్చినపుడు, లేదా పిండమును 12చే భాగించగా శేషతుల్యరాశికిగాని, తత్త్రికోణరాశికిగాని శని వచ్చినపుడు కుటుంబాదులకు కష్టము చెప్పవలెను.
బుధాష్టకవర్గీయ త్రికోణైకాధిపత్య శోధన
ఉదా. 6శేషము. అనగా ఆర్ధనక్షత్రము; దానికి 10వది స్వాతి; 19వది శతభిషం; 600÷12=50, 0శే. వృషభము. అక్కడికి శని వచ్చినపుడు కుటుంబాదులకు కష్టము చెప్పవలెను.
గుర్వష్టకర్గ ఫలము:
గురునకు పంచమ స్థానమువలన జ్ఞాన, పుత్ర, ధర్మాది విచారణ చేయవలెను. ఏరాశిలో రేఖాధిక్యముండునో ఆ రాశిలో పుత్రాదిజ సుఖము కలుగును. గురునకు పంచమమున ఎన్ని రేఖలున్నవో అంతమంది సంతానము కలుగుదురు. కాని గురుడు నీచ, శత్రుక్షేత్రగతుడు కారాదు. పంచమాధిపతిఉన్న నవాంశసంఖ్యా తుల్యమైన సంతతికాని యుండును. యోగపిండమును పంచమ రేఖాస్థానసంఖ్యచే గుణించి, 27 చే భాగించగా వచ్చిన శేషతుల్య నక్షత్రము లేక తత్త్రికోణ(10, 19) నక్షత్రమునకుగాని, లేదా పిండమును రేఖాసంఖ్యచే గుణించి, 12చే భాగించగా వచ్చిన శేషరాశికి శని వచ్చినపుడు కుటుంబాలకు కష్టకము చెప్పవలెను
గుర్వష్టక వర్గీయ త్రికోణైకాధిపత్య శోధన
రాశి యోగపిండము 98+90= గ్రహపిండము. దానిని పంచమ రేఖలు (4) గుణించగా 748÷27=27- 19 శేషము; మూల, అశ్విని, మఖలు. అదేవిధముగా 748÷12=64- 2. కర్కటకమునకు శని వచ్చినపుడు కుటటుంబాలకు కష్టకము చెప్పవలెను.
శుక్రాష్టక వర్గఫలము
శుక్రాష్టకవరులో ఏరాశిలో రేఖక్కువగా ఉండునో ఆరాశి శుక్రుడువచ్చినపుడు భూమి, ధనము, కలత్రలాభము, తత్త్రద్రాశి దిశనుండి జరుగును. శుక్రునికి సప్తమమునుండి స్త్రీ ప్రాప్తిని విచారించవలెను. సప్తమభావము, దానికి నవమ, పంచమరాశుల దిశ, దేశములనుండి స్త్రీప్రాప్తి చెప్పవలెను. పిండవర్థనాదులుచేసి పూర్వమువలెనే స్త్రీకష్టము విచారించవలెను. అనగా శుక్రాధిష్ఠితరాశికి సప్తమ రాశిలో ఉన్న రేఖాసంఖ్యచే పిండమును గుణించి. 27 చే భాగించగా శేషనక్షత్రము కాని, తత్త్రికోణ (10, 19) నక్షత్రమునకుగాని, లేదా పిండమును 12చే భాగించగా శేషరాశికిగాని తత్త్రికోణరాశికి శని వచ్చినపుడు భార్యాదులకు కష్టము చెప్పవలెను.
శుక్రాష్ట వర్గీయ త్రికోణైకాధిపత్య శోధన
ఉదా : రాశిపిండము=117. గ్రహపిండము 37+117=154×4=616÷27=22-22శేషం. 22వ నక్షత్రము శ్రవణము. 10వది రోహిణి, 19వది హస్త. 154÷12=62-4 శేషము. కన్యారాశి. దానికి త్రికోణరాశులు 5మకర, 9వృషభములకు గాని, శ్రవణ రోహిణి హస్తలకుగాని శని వచ్చినపుడు భార్యాదులకు కష్టము చెప్పవలెను.
శన్యష్టకవర్గ ఫలము
శని ఉన్న స్థానమునకు అష్టమస్థానము మృత్యుస్థానము; అదేవిధముగా ఆయుః స్థానముకూడ. కావున దానినుండి ఆయుర్విచారము చేయవలెను. లగ్నమునుండి శని వరకు (శన్యష్టకవర్గులో) రేఖలను కూడుము. దానికి సమమైన సంవత్సరమున వ్యాధి, శత్రుత్వము కలుగును. అదేవిధముగా శనినుండి లగ్నమువరకు ఫలయోగముచేసిన, తత్తుల్య సంవత్సరమున కష్టము కల్గును. రెండు ఫలయోగమునకు (అన్ని రేఖలు కలిపిన) సమమైన వర్షమందు మృత్యుతుల్య కష్టము. అది అరిష్టదశయైన, నిస్సందేహముగా మృత్యువు కలును.
శన్యష్టక వర్గీయ త్రికోణ ఏకాధిపత్య శోధన
ఉదా : లగ్నమునుండి శనివరకు 2+2=4; శనినుండి లగ్నమువరకు 39; +4=43. 4వ సం.న, 39వ సం.న రోగము, 43వ సం.న. మృత్యుసమానమైన కష్టము చెప్పవలెను.
మృత్యు సమయము
శనియొక్క అష్టమరాశి రేఖలనుండి వెనుకటివలెనే పిండమును గుణించి, 27 చే భాగించగా శేషనక్షత్రము, దీని కేంద్రకోణము (10, 19) లందుగాని, పిండమును 12చే భాగించగా శేషరాశి, లేక తత్త్రికోణరాశులందుగాని శని వచ్చినపుడు జాతకునికి మరణము కలుగును.
రాశిపిండము 109+36 గ్రహపిండము. మొత్తము 145÷2=290÷ 27=10 -20 శేషము. పూ.షా. త్రికోణ నక్షత్రములు భరణి, పుబ్బలు; 290÷ 12-24- 2 శేషం. ధనుస్సు, త్రికోణరాశులు మేషసింహములు. వాటిలోనికి శని వచ్చినపుడు మృత్యువు కలుగును.
విశేషము
శని రేఖాహీనరాశికి వచ్చునపుడు అశుభమును, అధిక రేఖాయుక్తమైన రాశికి వచ్చినపుడు శుభమును చెప్పవలెను. రేఖానుసారము ఫలము నిచ్చును.
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 83
అష్టక వర్గాయుర్దాయాధ్యాయము
ఇప్పుడు అష్టవకవర్గమువలన కలిగిన ఆయుర్దాయమును చెప్పబడుచున్నది. రేఖలులేని రాశికి 2దినములు; 1 రేఖకు 1½ దినము, 2రేఖల రాశికి 1దినము; 3రేఖలరాశికి ½ దినము, 4రేఖలున్నరాశికి 7 ½ దినము, 5రేఖలున్న రాశికి 2సం.లు; 6రేఖలున్న రాశికి 4సం.లు; 7 రేఖలున్న రాశికి 6సం.లు. 8 రేఖలున్న రాశికి 8సం.లు. అష్టవర్గజ ఆయువు. ఈ ప్రకారము అన్ని రాశులకు ఆయువును కలిపి, దానిలో సగము స్ఫుట అష్టవర్గజ ఆయువగును.
సం. మా. ది. ఘ.
రవి 12- 0 29-30
చంద్ర 14- 0 26- 0
కుజ 4 -1 13- 0
బుధ 16- 1 9- 0
గురు 16- 0 26- 0
శుక్ర 12- 0 19- 0
శని 6- 0 28- 30
మొత్తం 80- 7 1- 0
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 84
సముదాయాష్టక వర్గాధ్యాయము:
జన్మాంగచక్రమున లగ్నాదిభావములను, గ్రహములను వేసి, ప్రతి రాశిలోను అన్ని అష్టకవర్గులలో వచ్చిన రేఖలను కూడివేయవలెను. ఎనిమిది అష్టకవర్గులలోను ప్రతి భావమునకు మొత్తమెన్ని రేఖలు వచ్చెనో వేయవలెను. అది సముదాయాష్టకవర్గచక్రము. తదనుసారము జాతకునికి శుభాశుభములు చెప్పవలెను.
సముదాయ రేఖాఫలము
1) సముదాయాష్టక వర్గీయ చక్రమున ముప్పదికి పైగా రేఖలున్న రాశి శుభప్రదము,
2) 25-30 మధ్య నున్న మధ్యమము;
3) 25కన్న తక్కువ రేఖలు కలది అధమము, అశుభప్రదము.
4) శుభకార్యములందు శుభప్రదరాశులను గ్రహించవలెను.
5) అల్ప రేఖలున్న రాశులను వదలవలెను.
6) ఎక్కువ రేఖలున్న రాశిలోని గ్రహము శుభప్రదము,
7) అల్ప రేఖలున్న రాశిలోని గ్రహము అశుభప్రదమని తెలియునది.
8) ఇట్లు సమస్త భావముల ఫలము రేఖానుసారముగనే యుండును.
9) అధిక రేఖా సంఖ్య ఉన్న ఉత్తమము, అల్ప రేఖసంఖ్య హీనము, మధ్యదిమధ్యమము.
విశేషము
సముదాయాష్టక వర్గ చక్రమున
1. దశమభావములోని రేఖలకన్న లాభములో ఎక్కువ, లాభముకన్న వ్యయమున తక్కువ,
2. లగ్నమున ఎక్కువ ఉన్న జాతకుడు ధన భోగపరిపూర్ణుడగును.
3. దీనికి విపరీతముగా అనగా దశమముకన్న లాభము తక్కువ, వ్యయము ఎక్కువ, లగ్నమున తక్కున ఉన్న దారిద్ర్యము కల్గును.
దశాఫలములో ద్వాదశ భావముల ఫలములు
దశాఫలముతో సమముగా ద్వాదశభావముల ఫలము మూడు ఖండములు.
1) లగ్నాది చతుర్థాంతం ప్రథమఖండము,
2) పంచమాది అష్టమాంతం ద్వితీయఖండము,
3) నవమాది ద్వాదశాంత ఖండము మూడవది.
ప్రథమఖండఫలము బాల్యములోను,
ద్వితీయఖండ ఫలము యౌవనములోను,
తృతీయఖండఫలము వార్ధక్యమున చెప్పదగినది.
ఏఖండమున పాపగ్రహాధిక్య ముండునో అప్పుడు కష్టాధిక్యము,
శుభాధిక్య మెప్పుడుండునో అప్పుడు సుఖము చెప్పదగినది.
మిశ్రమముగానున్న మిశ్రఫలము కలుగును.
ఉదా. రవ్యాద్యష్టకవర్గు లన్నిటిలోను కలిపి మేషాదిరాసులకు వచ్చిన రేఖలు మే:32; వృష:23; మి:19; కర్క:24; సిం:30; కన్య:25; తుల:28; వృశ్చి:25; 6:23; మ:31; కుం:35; మీ:30.
ఏ భావమున కధికమో ఆ భావమునకు అభివృద్ధియు, అల్పమున్న భావమునకు అల్పత్వమును చెప్పదగినది.
సశాంతి రేఖాఫలములు :
సముదాయాష్టకవరులో ఏడుగాని, అంతకు తక్కువగా రేఖలున్న ఆ మాసమున (ఆరాశికి రవి వచ్చినపుడు) మృత్యువు కలుగును. దాని శాంతికై 20పలముల బంగారము, రెండు తిలరాశులు దానము చేయవలెను.
ఎనిమిది రేఖలున్న మాసమున కల్గుమృత్యు శాంతికై కర్పూర తులాదానము చేయవలెను.
9 రేఖలున్న, సర్పమువలన మృత్యుభయముండును. దానిశాంతికై నాలు గుర్రములతో కూడిన రథమును దానమీయ్యవలెను.
పది రేఖలున్న శస్త్రమువలన మృత్యువు కలుగును. శాంతికిగా వజ్రకవచము దానమియ్యవలెను. పదకొండు రేఖలున్న అధిశాపము వలన మృత్యుభయమున్నది. శాంత్యర్థమై 10పలముల బంగారముతో చంద్రమూర్తి చేసి దానము చేయవలెను.
12రేఖలున్న జలమువలన మృత్యువున్నది. తల్లికై బ్రాహ్మణులకు భూమిదానము చేయవలెను. 13 రేఖలున్న వ్యాఘ్రమువలన మృత్యువున్నది. తచ్చాంతికై హిరణ్యగర్భ, విష్ణుప్రతిమ దానము చేయవలెను.
14 రేఖలున్నమృత్యుభయము, శుభప్రాప్తికై వరాహమూర్తి బంగారుప్రతిమ దానము చేయవలెను.
15 రేఖలున్న రాజభయము కలుగును. శాంతికై ఏనుగు దానము చేయవలెను.
16 రేఖలున్న అరిష్టము కలుగును. శాంతికై కల్పవక్షప్రతిమ దానము చేయవలెను.
17 రేఖలున్న రోగభయము, శాంతికై గుడము, గోవును దానమియ్యవలెను.
18 రేఖలున్న మాసమున కలహము కలుగును. శాంతికి రత్నమును, గోవును, భూమిని దానము చేయవలెను.
19 రేఖలున్న దేశత్యాగము కలుగును. దానికి విధిపూర్వకముగా శాంతి చేయవలెను.
20 రేఖలున్న బుద్ధినాశము కలుగును. శాంతికై ధాన్యరాశి దానము చేయవలెను.
21 రేఖలున్న బంధుపీడ కలుగును. శాంత్యర్థమే అద్దము దానమియ్యవలెను.
23 రేఖలున్నఅనేక కష్టములు కలుగును. శాంతికై 7 పలముల బంగారు సూర్యప్రతిమ దానము చేయవలెను.
24 రేఖలున్న బంధుహీనుడగును. శాంతికై గోదానము చేయవలెను.
25 రేఖలున్న బుద్ధిహీనుడగును. శాంతికై సరస్వతీపూజ చేయవలెను.
27 రేఖలున్న ధనక్షయము, శాంతికై శ్రీ సూక్తము జపించవలెను.
28 రేఖలున్న అనేక బాధలు శాంతికి సూర్యప్రీతికి హెూమము చేయవలెను.
29 రేఖలున్న చింతా వ్యాకులత కలుగును. శాంతికై నెయ్యి, వస్త్రము, బంగారము దానము చేయవలెను.
30 రేఖలున్న ధనధాన్యప్రాప్తి కలుగును.
ఆయా దోషములు ఆయా రాశికి సూర్యుడు వచ్చినపుడు జరుగును. శాంతి చెప్పనదికూడ సమర్థులైన, రాజువంటి వారికి, సామాన్యలకు తదభావస్థితిలో తగినట్టు దానము చేయవలెను.
అధిక రేఖలున్న ఫలములు
30కన్న అధికముగా రేఖలున్న రాశిలోరత్నద్రవ్యములు, అన్య వస్తువులు ప్రాప్తించును.
40 కన్న అధికముగా ఉన్న ధనపుత్రాది సుఖముతో పాటు పుణ్యము, లక్ష్మీ వృద్ధియగును.
అష్టవర్గ ప్రశంసా ఫలము:
అష్టకవర్గ విశుద్ధమైనరాశి శుభకార్యములందు శుద్ధమైనది.
కాని అన్ని శుభకార్యములకు అష్టవర్గశోధన విద్వత్సమ్మతము.
అష్టవర్గశోధన చేయనంతవరకే గోచారశుద్ధికి ఆవశ్యకత.
అష్టవర్గశుద్ధి తెలిసిన తర్వాత గోచారశుద్ధి నిరర్ధకము.
గోచార శుద్ధికన్న అష్టవర్గశుద్ధి అధిక ప్రధానమైనది.
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 85
రశ్మిఫల వర్ణనాధ్యాయము:
గ్రహములయొక్క రశ్ములను చెప్పబడుచున్నది, పరమోచ్చ స్థానమున రవ్యాది గ్రహములకు క్రమముగా 10, 9, 5, 5, 7, 8, 5 రశ్ములుండును. పరమనీచయందు శూన్యరశ్ములుండును. మధ్యమున అనుపాతమున రశ్మి జ్ఞానము చేయదగినది. ఎట్లన ఏ గ్రహముయొక్క రశ్ములను తెలియవలెనో ఆగ్రహము రాశ్యాదిలో నీచరాశ్యాది తీసివేసి శేషము 6రాశులకన్న అధికమైన 12లో తీసివేసి శేషమును 6రాశులకన్న తక్కువ అయిన ఉన్న స్థితిలోనేఉంచి, ఆ గ్రహము రశ్మిసంఖ్యచే గుణించి, 6చే భాగించిన లబ్ది దానిరశ్మిసంఖ్య అగును.
సంస్కార విశేషము
చాలమంది ఆచార్యులు రశ్మి విషయమున సంస్కారము చెప్పియున్నారు. ఉచ్చస్థానమున ఉన్న గ్రహమునకు త్రిగుణితము చేయుట, స్వత్రికోణమున ద్విగుణితము, స్వక్షేత్రమున ఉన్న త్రిగుణితము చేసి, సగము చేయుట, అధిమిత్ర క్షేత్రమున 4చే గుణించి 3చే భాగించుట, మిత్రగృహమున 6చే గుణించి, 5చే భాగించుట; శత్రుక్షేత్రమున సగము చేయుట, అధిశత్రు గృహమున 2చే గుణించి 5చే భాగించుట; సమక్షేత్రమైన ఉన్న దున్నట్లుంచుట; శనిశుక్రులు తప్ప తక్కిన గ్రహములస్తంగతులైన రశ్మి రహితులగుదురు. ఫలము రశ్మిపై ఆధారపడివున్నది.
ఒక జాతకమున నిర్ణయ స్ఫుటరవి 2- 17- 21, చంద్ర 8- 9- 3, కుజ 0- 10- 13, బుధ 2- 13- 8, గురు 0- 12- 22, శుక్ర 2- 17- 35, శని 7- 21- 12.
దీనిలో రవి రశ్మి ఎట్లనగా రవి 2- 17- 21లో నీచరాశ్యాది 6 -10 -0 తీసివేయగా 8- 7- 21, 6కన్న ఎక్కువ కనుక 12లో తీసివేయగా 3- 22- 39. దీనిని 10చే గుణించి, 6చే భాగించగా 6- 7-46. రవి బుధుని క్షేత్రములో ఉన్నాడు. బుధుడు తాత్కాలిక శత్రువు కనుక సగము చేయగా ఫలము స్ఫుటరశ్మి 3- 3- 53.
చంద్రుడు 8 -9 -3 - 7 -3- 0 నీచరాశ్యాది–1 -6 -3×9=10 -24- 17÷ 6=1- 26- 4. చంద్రుడు గురుక్షేత్రమున ఉన్నాడు. గురుడు తాత్కాలిక శత్రువు కావున సగము చేయగా ఫలము స్ఫుటరశ్మి 0-28- 2.
కుజుడు 0- 10 -13- - 3- 28- 0 నీచరాశ్యాది =8- 12- 13. 6కన్న ఎక్కువ కావున 12లో తీసివేయగా 12 -0 -0 -8- 12- 13 =3 -17- 45×5=10 -28- 55÷ 6=1- 24 -50 స్వక్షేత్రమున ఉన్నందున 3చే గుణించి సగము చేయగా స్ఫుటరశ్మి 2- 22 -15.
బుధుడు 2 -13- 8 -11 -15- 0=2- 28- 8×5=12- 20 40÷ 6=2 -3- 26. స్వక్షేత్రవర్తి కావున 3చే గుణించి, సగము చేయగా స్ఫుటరశ్మి 3- 5 -9.
గురుడు 0- 12 -22 -9- 5- 03- 7 =22×7=22- 21 -34÷6=3- 23 -35.
గురుడు కుజక్షేత్రమున ఉన్నాడు. కుజుడు మిత్రుడు+తాత్కాలిక శత్రువు సముడు కావున ఉన్న దున్నట్లే.
స్ఫుటరశ్మి 3- 23- 25. శుక్రుడు 2 -17- 35 -5 -27- 0=8- 20- 35 12 -0 -0 8- 20- 35=3- 9- 25×8=28- 15- 20÷6=4- 12- 33. శుక్రునికి బుధుడు మిత్రుడు, తాత్కాలిక శత్రువు. కావున సముడు. కనుక ఉన్న దున్నట్లే.
స్ఫుటరశ్మి 4- 12- 33.
7-21-12 -0-20- 0-7 -1- 12. 12-0-0 -7-1-12=4-28-48×5 24-24=0÷6=4-4-0 శత్రుగృహము÷తత్కాలిక శత్రువు+అధి శత్రువు కనుక 2చే గుణించి 5చే భాగించగా స్ఫుటరశ్మి 1-19-36.
రశ్మి యోగఫలము
1-5 వరకు రశ్మియోగమున్న ఉన్నతవంశజుడైనా దరిద్రుడు, దుఃఖితుడు అగును.
5 -10 వరకు రశ్మియోగమున్న భారవాహుడు, దరిద్రుడు, భార్యా, పుత్ర, గృహవిహీనుడగును.
11 రశ్మిసంఖ్య అయిన అల్పధనము, అల్పపుత్రులును;
12. అయిన స్వల్పధనుడు, ధూర్తుడు, మూర్ఖుడును;
13. అయిన చోరుడు, నిర్దనుడు, కులాధముడును అగును.
14. అయిన ధర్మనిష్ఠుడు, తన బంధువులను పోషించువాడు, వంశానుగతమైన కర్మ చేయువాడు, వీద్వాంసుడు, ధనపూర్ణుడు అగును.
15. అయిన జ్ఞానగుణసంపన్నుడు, వంశముఖ్యడు. ధనవంతుడు అగును.
16 అయిన కుల శ్రేష్ఠుడు,
17 అయిన బహు సేవకులు కలవాడు.
18అయిన కుటుంబపూర్ణుడు,
19అయిన కీర్తిమంతుడు,
20అయిన ముందు వెనుక మనుష్యులు కలవాడగును.
21 రశ్ములయిన 50మందిని పోషించువాడును,
22అయిన దానవంతుడు, కృపా పరుడును;
23అయిన సుఖవంతుడు, సంపత్తిశాలి, సుశీలుడు అగును.
24నుండి 30వరకు వున్న లక్ష్మీవంతుడు, బలవంతుడు, రాజప్రియుడు, తీవ్ర బుద్ధిశాలి, అనేక జనులతో కూడినవాడు అగును.
30 నుండి 40వరకు వున్నచో నూరు నుండి వెయ్యివరకు జనులను పోషించు ప్రాంతపాలకు డగును.
40 నుండి 50వరకు రాజున్ను, 50దాటిన చక్రవర్తి అగును.
జన్మకాలికభేటోత్తరశ్మీనాం వశతస్తథా || శ్లో | జాతీవంశానురోధేన జన్మినాం ఫలమాది శేత్ | | బ్రాహ్మణో యజ్ఞనిరతః, క్షత్రియస్సార్వ భౌమకః || 19 శ్లో | వైశ్యస్తు నృపతిఃజేయః శూద్రో ధాన్యదనాన్వితః | |
జన్మకాలిక గ్రహముల కిరణములవలన, జాతి వంశానుసారమును జాతకుల ఫలితము చెప్పవలెను. బ్రాహ్మణుడైన యోగనిరతుడున్ను, క్షత్రియుడైన సార్వభౌముడున్ను, వైశ్యుడైన రాజున్ను, శూద్రుడైన ధనధాన్య పూర్ణుడు అగును.
విశేషము
విశేషమేమనగా ఉచ్చాభిముఖమై నీచనుండి ఉచ్చకువెళ్ళేడి గ్రహముల కిరణము అధిక ఫల ప్రదములు;
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 86
సుదర్శన చక్ర ఫలము:
పూర్వము బ్రహ్మ చెప్పిన సుదర్శన చక్రము లోకుల హితమునకై చెప్పబడుచున్నది. అన్ని భావములయొక్క వర్షాదుల యొక్క ఫలమును చెప్పవీలగును.
ఒక కేంద్రము పై మూడు వృత్తములు 12 గడులుండునట్లు చేసిన దానిని సుదర్శన చక్రమందురు. ప్రథమ వృత్తము కోష్ఠములలో లగ్నాది ద్వాదశ భావములు, గ్రహములతో వ్రాయవలెను. రెండవ వృత్తకోష్ఠములలో చంద్రాది భావములు, గ్రహములను వేయవలెను. మూడవ వృత్తకోష్ఠములలో రవ్యాశ్రిత రాశి నుండి ప్రారంభించి, అన్ని భావములను, గ్రహములను వేయవలెను. ఈ చక్రము ఒక్కొక్క భావమున మూడేసి రాశులుండును.
చక్రము యొక్క విశేషము
ఈ చక్రమున రవి, చంద్ర, లగ్నములు ఒకే వరుసలో వచ్చును. లగ్నభావమును లగ్నముగా చేసి, తక్కిన భావములను, భావస్థ గ్రహములను వేయవలెను. గ్రహస్థితివశమున
వాటి ఫలము చెప్పవలెను. రవిలగ్నమున శుభుడు. తక్కినచోట్ల అశుభుడు, పాపుడు ఉచ్చలోగాని, స్వరాశిస్థుడైనగాని అశుభుడుకాడు. ఇట్లు పరికించి భావముల శుభాశుభఫలము చెప్పవలెను.
సగ్రహ భావఫలము ఆ భావమందున్న గ్రహానుసారము చెప్పవలెను. భావము నిర్గ్రహమైన ఆ భావము పై ఏ గ్రహదృష్టి పడునో తదనుసారము చెప్పవలెను. అనేక గ్రహముల యుతి, దృష్టి ఉన్న అందులో ప్రబలమైన గ్రహానుసారము చెప్పవలెను. శుభగ్రహమున్న భావఫలము శుభము.కేవల పాపగ్రహములున్న అశుభము. శుభగ్రహదృష్టి ఉన్న శుభమే. అశుభగ్రహ దృష్టి ఉన్న అశుభము. శుభాశుభ గ్రహములున్న మిశ్రఫలము. అందును శుభాధిక్యమున శుభము, అశుభాధిక్యమున అశుభము అగును. శుభపాపగ్రహములు సమముగా ఉన్న ప్రబల గ్రహముయొక్క ఫలము కలుగును. బలముకు సమమైన ఫలము మిశ్రమముగా అగును. దృష్టిలోకూడ అధిక దృష్టియున్న వారి ఫలము చెప్పునది. గ్రహసంబంధము, దృష్టి లేని భావమునకు తదధిపత్యనుసారము శుభాశుభత్వము తెలియదగినది. అశుభగ్రహమైనా సద్గ్రహాధిక్యమున్న మంచి ఫలమిచ్చును. శుభగ్రహమైనా అసద్వర్గాధిక్యమున అశుభఫలమునే యిచ్చును. పాప, శత్రు, నీచస్థులైన వారి వర్గముల శుభములు; స్వక్షేత్ర, ఉచ్చ, శుభగ్రహవర్గులు శుభపరిప్రదములు.
ఈరీతిగా సనుస్త భావములకు, గ్రహములకు శుభాశుభత్వమును పూర్తిగా విమర్శించి, అప్పుడు ఫలను చెప్పవలెను.
జాతకమున రవి, శనులు క్రూరగ్రహములైనచో శుభవర్గమెక్కువగా ఉంటే సములౌతారు. కుజుడు పాపవర్గము లేకపోగా, స్వక్షేత్రవర్తి యైనచో శుభుడే. సముడు జాతకునికి ఉపకారమూ చేయడు; అపకారమూ చేయడు. శుభుడుపకారము చేయును. పాపుడపకారము చేయును. రాహువు శుభాధికుడైనచో శుభుడ; కేతువు పాపపర్గాధికుడైన పాపుడు.
సుదర్శన చక్రమువలన ఏఫలము జాతకులకు కలుగునట్లయిన, ప్రాచీన ఋషులు లగ్నవశాత్తు కలుగునని ఎందుకు చెప్పినారో చెప్పబడుచున్నది.
లగ్నాతిరిక్త స్థానములందు రవిచంద్రులు ఉన్న యెడల సుదర్శన చక్రమును బట్టి ఫలము చెప్పుట సమ్మతము. ఆ లగ్న రవిచంద్రులలో రెండుగాని, మూడుగాని ఒక్క చోట ఉన్న లగ్నవశమున గ్రహములయొక్క భావములయొక్క ఫలము చెప్పుట మంచిది.
ఇప్పుడు నేను భావములయొక్క దశాంతర్దశాదులను, సుదర్శన చక్రము వలన వచ్చిన వర్ష, మాసాదుల ఫలము చెప్పుచున్నాను. భావముల దశ, అంతర్దశ, ప్రత్యంతర్దశల పరిమాణము క్రమముగా 1వర్షము, 1నెల, 2 ½ దినములు. భావాధిపతితో ప్రారంభించి, అన్ని భావములకు 1సంవత్సర ప్రమాణముగా దశలు చూడవలెను. ఆ భావమును లగ్నముగా జేసి, ముందున్న భావములను ధనాధిభావములనుకొని, చెప్పబోపురీతిగా వాటి ఫలితముల నా సంవత్సర దశలో తెలియదగినది. ప్రతి సంవత్సరములోను, ఒక్కొక్కనెల అంతర్దశా ప్రమాణము. అంతర్దశ తమ భావమునుండి ప్రారంభమగును. క్రమముగా ధనాది పండ్రెండు రాశులకు ఉండును. అంతర్ధశలో ప్రత్యంతర దశలు 12నడచును. కనుక నెలలో అన్ని భావముల ఫలములు ఉండును. ప్రత్యంతర్దశ కల రాశిని లగ్నముగా చేసి, ముందు భావములను ధనాదులుగాజేసి, భావఫలములు చూడవలెను.
ఫలకథనవిధి
దశారంభకాలిక లగ్నమునకు కేంద్ర, కోణ, అష్టమములందున్న శుభగ్రహములు శుభప్రదులు. రాహుకేతువులు ఏరాశియందున్న ఆ భావమునకు హాని కలుగును. ఎక్కువ పాపగ్రహములున్న భావమునకు వినాశము కలుగును. 3.6, 11 లందు పాపగ్రహములు, 6, 12, కాక తక్కిన స్థానములందు శుభగ్రహములు ఉన్న శుభఫలము కలుగును. ఇట్లు వర్షారంభమునగాని, మాసారంభమునగాని, భావముల ఫలముల తెలియవలెను. ఆయుర్దాయ విచారణలో దశమావృత్తి నుండి 12×10= 120 సం.లు పరమాయువుగా తీసుకుని దశలు చూడవలెను.
ఉదా : ప్రథమవర్షమున జన్మలగ్నమే వర్షలగ్నమగును.
ఉదా : సుదర్శన చక్రము ప్రకారము తులాలగ్నము అనుకొనుము. వృశ్చికాదులే ధనాదిభావములగును. ఫలము చెప్పవలసి వచ్చినచో లగ్నమున శు,బు,ర చంద్రులు. అందరును శుభులే. రవిపాపియైనా లగ్నస్థుడు కనుక శుభప్రదుడే. ద్వితీయమున రాహువు. తద్భావహాని. పంచమమున కుజగురులు ఇద్దరునుకేవలము శుభవర్గము మాత్రమే కలవారు. షష్ఠమున శని రాహువులు పాపులు 3, 6, 11లలో శుభఫలప్రదులు. సప్తమమున కు, గు, ర, బు, శు, చంద్రులు. అందరును శుభులే, అష్టమమున రాహువు. ఆరోగ్యము చెడును. నవమము ర, బు, శుక్రులు మంచిదే. లాభమున కుజగురులు మంచివారే. వ్యయమున శని రాహువులు దుర్వ్యయము, అనుకోని ఖర్చులు వచ్చి ఖర్చగును.ద్వితీయవర్షమున ధనభావమున వర్షలగ్నమగును. దానితో భావములన్నియు ఒక అంకె ముందుకు జరుగును. అంతర్దశలలో ప్రథమవర్షమున ముందుగా తులాంతర్దశయే. రెండవ మాసమున వృశ్చిక అంతర్దశ. ఇట్లే తక్కినవియు. ఇట్లు జన్మను మొదలుకొని 12ఏండ్ల కొకసారి దశలు తిరిగివచ్చును. 12వ సం.న తులాదశ ప్రారంభము. ఇట్లు 25, 37, 49, 61 సం.లలో తులాదశ తిరిగి వచ్చును. అట్లు పూర్ణాయువు 120సం.లు. కనుక 10 ఆవృత్తులు చేసికోవచ్చును. ప్రతి అంతర్దశలోను ప్రత్యంతర్దశ (విదశ) 2 ½ దినములుండును. ప్రారంభక అంతర్దశదే విదశ ప్రారంభమగును. ఆ అంతర్దశ 1నెలలో 12విదశలు (2- 30×12=30) తిరిగి వచ్చును. కావున ప్రతినెలలోను అన్ని విదశలు తిరిగి వచ్చును.
ఫల నిర్ణయము
ఇట్లు సుదర్శనచక్రోద్భవమైన వర్షమాసాదిఫలము, అష్టకవర్గోద్భవ ఫలము తెలిసికొని, ఫలనిర్ణయము చేయవలెను. రెండురీతులలోను శుభత్వముకాని అశుభత్వముగాని, ఏదివచ్చిన అది చెప్పవలెను. ఒకదాని ప్రకారము శుభము, మరొక దానిరీత్యా అశుభము వచ్చిన, ఏది బలవత్తరమో చూడవలెను. సమముగా ఉన్న బాధయేలేదు. రెండును చెప్పవచ్చును.
Comments
Post a Comment