శాలివాహన శక సంవత్సరం and సూర్యసిద్ధాంతం
శాలివాహన శక సంవత్సరం అంటే ఏమిటి
భారత ప్రభుత్వం శాలివాహన శక సంవత్సరం ఎందుకు వాడుతోంది.
శాలివాహన శకం ఏ నెలలో ఏ తేదీ నుండి మొదలవుతుంది.
ఆ తేదీకున్న ప్రాధాన్యత ఏమిటి
సూర్య సిద్ధాంతంలో దాన్ని ఏమని పిలుస్తారు.
సౌరమానం అంటే ఏమిటి సౌరమానం ఎన్ని విధాలుగా ఉంది.
ఈ విషయాలు తెలుసుకుంటే దృక్ అంటే ఏమిటో అర్థం అవుతుంది.
సూర్యసిద్ధాంతం
అహర్గణ పాఠం , గ్రహ మధ్యమ స్ఫుటములు .
✍️డా.శంకరమంచి శివ సిద్ధాంతి
అహర్గణ గణితం :
శ్లోకం 50: 49 వ శ్లోకంలో వచ్చిన అహర్గణ సంఖ్యలో నుండి క్షయ తిథులతో హెచ్చించి మహాయుగీయ చంద్ర తిథులతో భాగిస్తే మనకు ఎన్ని క్షయ తిథులు గడిచాయో వస్తాయి . ఇప్పుడు ఈ గడిచిన క్షయ తిథులను 49 వ శ్లోకంలో వచ్చిన అహర్గణ సంఖ్యలో నుండి తీసివేస్తే సృష్ట్యాది అహర్గణ వస్తుంది .
శ్లోకం 51: వారధిపతిని గణితం చేయటం :
సృష్ట్యాది అహర్గణను 7 చేత భాగించగా వచ్చిన శేషం వారధిపతిని తెలియచేస్తుంది . శేషం 1 వస్తే ఆదివారం , 2 వస్తే సోమవారం , 3 వస్తే మంగళవారం , 4 వస్తే బుధవారం , 5 వస్తే గురువారం , 6 వస్తే శుక్రవారం , 7 వస్తే శనివారం అని తెలుసుకోవాలి .
శ్లోకం 52 : మాసాధిపతి మరియు సంవత్సరాధిపతి గణితం : అహర్గణను 30 చేత భాగించి వచ్చిన లబ్ధము ను 2 చేత హెచ్చించి దానికి 1 కలిపి 7 చేత భాగిస్తే వచ్చిన శేషము మాసాధిపతి అవుతారు .
అదేవిధంగా అహర్గణను 360 చేత భాగించి వచ్చిన లబ్దమును 3 చేత హెచ్చించి దానికి 1 కలిపి 7 చేత భాగించగా వచ్చిన శేషం సంవత్సరాధిపతి అవుతారు . గణిత ఉదాహరణ నేను రాసుకున్న నోట్స్ లో చుడండి .
శ్లోకం 53: మధ్యమ గ్రహ స్ఫుటాలు :
సూత్రం : అహర్గణను గ్రహము యొక్క మహాయుగీయ భగణాలతో హెచ్చించి వచ్చినదాన్నిమహాయుగీయ సావన దినములలో భాగిస్తే మనకు మధ్యమ గ్రహ స్ఫుటాలు వస్తాయి .
గణితం అంతా నేను రాసుకున్న నోట్స్ లో ఉన్నది శ్రద్ధగా చదవండి .
ద్వాపరయుగాంతానికి గ్రహములు అన్ని 0 డిగ్రీ లో ఉన్నాయి అని శాస్త్రం చెబుతోంది . మన గణితం సరైనదా కాదా అని సరిచేసుకోవడానికి ద్వాపరయుగాంతానికి అహర్గణ గణితం చేసి మధ్యమ గ్రహ స్ఫుటాలు గణితం చేస్తే మనం చేసేది సరైనది అని తెలుస్తుంది . కలియుగ ప్రారంభానికి 0 డిగ్రీ లో ఉన్నాయి అని మొన్న గణితం పోస్ట్ నాన్నగారు పెట్టారు అదికూడా ఒకసారి మళ్ళీ చుడండి . అందరికి నమస్కారం .
మీకు అందరికి అర్థమవడానికి గణిత ఉదాహరణ: 2012లో నాన్నగారు నాకు చెప్పినటువంటి నోట్స్ లో గణిత ఉదాహరణ ఉంది, చుడండి . నోట్స్ కూడా షేర్ చేస్తున్నాను. అందరికి నమస్కారం ✍️శంకరమంచి శివ సిద్ధాంతి.
Comments for the Pictures shared.
దీనినే వాస్తవిక దృక్ అంటారు.
ఇది మోడ్రన్ సైన్స్ ద్వారానే సాధ్యమవుతుంది.
Stellarium app లో ఈ విషయాలు ఉన్నాయి అండి
Comments
Post a Comment