సూర్య సిద్ధాంత పాఠం
సూర్య సిద్ధాంత పాఠం
✍️డా.శంకరమంచి శివ సిద్ధాంతి
గత పాఠంలో గ్రహాల యొక్క మధ్యమ స్పుటాన్ని గణితం చేశాం ఈ పాఠంలో శ్లోకం 54 లో గ్రహముల యొక్క శీఘ్రోచ్ఛ మందోచ్ఛ పాత యొక్క స్ఫటాలను కనుక్కుంటాం .
శ్లోకం 55లో ప్రస్తుత సంవత్సర నామాన్ని కనుక్కుంటాం. ఇక్కడ సంవత్సర నామాన్ని బారహస్పతిమానంలోనే గణితం చేయడం జరుగుతుంది. అంటే బృహస్పతి గతిని ఆధారం చేసుకుని గురు పరిభ్రమణానికి 12 హెచ్చించి వచ్చిన దాన్ని అరవై చే భాగించగా శేషము విజయదిగా ప్రస్తుత సంవత్సరమవుతుంది.
56వ శ్లోకంలో ఈ మధ్యమస్పుటాలను కలియుగాదిగా గణితం చేసే విధానాన్ని భగవానులు చెబుతారు.
57వ శ్లోకంలో కృతయుగాంతానికి గ్రహ మధ్యమస్పుటాలు 0 డిగ్రీల వద్ద ఉన్నాయి అని భగవానులు మనకి చెబుతారు. ఈ గణితమే చాలా కీలకంగా ఉంటుంది. దృక్కువారైనా సూర్య సిద్ధాంతం ద్వారా చేసిన మరి ఏ గ్రంథం ద్వారా చేసిన కృతయుగాంతానికి గ్రహ మధ్యమస్ఫుటాలు సున్నా వద్ద ఉన్నాయి అని గణితం పరంగా నిరూపణ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అది రానిపక్షంలో చేసే గణితము తప్పు అని భావించాలి.
58వ శ్లోకంలో కృతయుగా అంతానికి గ్రహమందోచ్చలు పాతలు ఏ విధంగా ఉన్నాయో చెప్పారు.
59 వ శ్లోకంలో భూమి యొక్క చుట్టుకొలత అంటే సర్గంఫరెన్స్ ఆఫ్ ఎర్త్ 5059.6 యోజనాలు అని భగవానులు చెబుతారు. ఆ గణితాన్ని నేను రాసుకున్న నోట్స్ లో చూడొచ్చు.
60 వ శ్లోకంలో దేశాంతర సంస్కార విషయాలను భగవానులు చెపుతారు.
అంటే మనము నివసిస్తున్నటువంటి లాటిట్యూడ్ కి గ్రహాల యొక్క గతులను క్యాలిక్యులేట్ చేయడం.
61వ శ్లోకంలో ఈ దేశాంతర సంస్కారాన్ని కలపాలా తీసివేయాల అనేటటువంటి సూత్రాలను ఇవ్వడం జరిగింది. ఒకవేళ ప్రధాన రేఖకు తూర్పున ఉంటే మనకి వచ్చినటువంటి దేశాంత సంస్కారాన్ని గ్రహ మధ్యమస్పూట నుంచి తీసివేయాలి. అదేవిధంగా పశ్చిమానికి ఉంటే కలపాలి.
62వ శ్లోకంలో ఉత్తర ధ్రువానికి లంగా నగరానికి మధ్య ఉన్నటువంటి నగరాల గురించి చెబుతారు.
రోహితక ఉజ్జయిని కురుక్షేత్ర అనే ప్రాంతాలు ఉత్తర ధ్రువానికి లంక నగరానికి మధ్య ఉన్నాయి. అంటే ధ్రువతార కి లంక నగరానికి గీతగిస్తే పై మూడు నగరాలు ఆ గీత పై ఉంటాయి గీత పై ఉన్నాయి అని భగవానులు చెబుతారు.
63 64 65 శ్లోకాలు గ్రహాల యొక్క ట్రస్ట్రియల్ ఆటిట్యూడ్స్ గురించి భగవానుల వివరిస్తారు ఇవి గ్రహణ సమయంలో వినియోగ పడతాయి.
66వ శ్లోకంలో వారము మెరీడియన్ రేఖ కు తూర్పున ఉన్నటువంటి వారికి అలాగే పశ్చిమాన ఉన్నట్టువంటి వారికి ఏ విధంగా ప్రారంభం అవుతుందో చెబుతారు.
67వ శ్లోకంలో ఇష్ట సమయానికి మధ్య గ్రహాల యొక్క సాధన భగవానులు చెబుతారు. 68వ శ్లోకంలో చంద్ర క్రాంతి గురించి వివరణ ఉంటుంది.
69 వ శ్లోకంలో లోకంలో గురు కుజ యొక్క క్రాంతులు ఏ విధంగా ఉంటాయో చెప్పారు. 70 శ్లోకంలో చంద్ర కుజ బుధ గురు శుక్ర శని యొక్క లాటిట్యూడ్స్ గురించి చెప్పడం జరిగింది. దీన్నే శర గణితం అని అంటారు.
ఇక్కడితో సూర్య సిద్ధాంతం ప్రథమ అధ్యాయము పూర్తి అయింది.
మీకు అందరికి అర్థమవడానికి గణిత ఉదాహరణ: 2012లో నాన్నగారు నాకు చెప్పినటువంటి నోట్స్ లో గణిత ఉదాహరణ ఉంది, చుడండి . నోట్స్ కూడా షేర్ చేస్తున్నాను. అందరికి నమస్కారం
✍️శంకరమంచి శివ సిద్ధాంతి.
Comments
Post a Comment