సూర్య సిద్ధాంత గణితంలో తిధులు
సూర్య సిద్ధాంత గణితంలో చేసిన తిధులు ప్రస్తుత కాలానికి సరిపోవటం లేదని ఏ కొలమానంతో తెలుసుకోవాలి?
తిధి ఖచ్చితంగా ఇన్ని గంటలకే అయిపోతుంది అని ఆకాశాన్ని చూస్తే ఎలా అర్థమవుతుంది.
తిధి ఇన్ని గంటలకు అయిపోతుంది అని గమనించటానికి ఏ గడియారాన్ని మనం ఉపయోగించాలి?
మరి భారతీయులు కనుగొన్న తిధి యొక్క అంత్య సమయాన్ని కనుగొనటానికి ఆకాశం వైపు చూసి తిధి ఈ సమయంతో పూర్తి అయినది ఎలా తెలుస్తుంది.
ఊహా జ్ఞానంతోనా, లేకపోతే పాశ్చాత్య నిర్మిత డిజిటల్ క్లాక్ తో నా.
పాశ్చాత్య పండితులు అందించిన అణువులతో కొలువబడుతున్న కాలాన్ని డిజిటల్ క్లాక్ తో సమయాన్ని తెలుసుకుంటూ ఇప్పుడు మనం జీవనాన్ని కొనసాగిస్తున్నాం.
అణు కాలాన్ని కొలిచే విధానాన్ని భారతీయ ఋషులు రాసిన గ్రంథాలలో దీని గురించి చెప్పలేదు కదా.
ఏ కాలానికి ఏ గడియారాలు వాడాలో సిద్ధాంతంలో చెప్పలేదుగా. సిద్ధాంతంలో చెప్పిన కాలసాధనతో సాధించిన సమయాన్ని మనం తీసుకోవాలి కదా.
దీనిని ఏ విధంగా సామన్వయం చేయాలి.
ప్రస్తుతం ఎదురవుతున్న సమస్య.
మన భారతీయ ఋషులు మనకు అందించిన ప్రాచీన గ్రంథాల ద్వారా వచ్చిన తిథి అంత్య సమయాన్ని,
పాశ్చాత్య పండితులు అందించిన ఎఫిమెరీస్ గణితంతో సరిపోల్చడం సరైన పద్ధతేనా ధర్మ కార్యాచరణకు దాన్ని స్వీకరించవచ్చా.
ఆకాశంలో జరిగే వింత, వినోదం కోసం, మరియు ఖగోళ అద్భుతాన్ని తెలుసుకోవడం కోసం పాశ్చాత్యులు గ్రహణ అంత్య సమయాలను మనకు అందిస్తున్నారు.
అదే సర్వ ప్రమాణంగా తీసుకున్నప్పుడు ధర్మశాస్త్ర రీత్యా ఉపయోగించే నిత్య తిథుల అంత్య సమయాలలో వ్యత్యాసం ఏర్పడటం వల్ల అపరాహ్ణ కాలంలో తిథి లేకుండా పోతోంది.
సనాతనే ధర్మే నిత్యానుష్టనే ఆగమేషు కర్తవ్యేషు వైదికకర్మసు నిత్యం సంకల్పే
ఆద్య బ్రాహ్మణః ఇతి బ్రహ్మయుః ప్రమానస్య ఆరంభం కృత్వా కలియుగే ప్రథమపదే...సవాగేరే సః ఋతౌ మాసే పక్సే తిథౌ వసరే, సూర్యసిద్ధాంతేన కాలస్య అదృశ్యరూపం ప్రాప్తం బ్రహ్మగరీ ఇత్యస్య జీవనం వయం ప్రతిదినం స్మరామః.
అపి
ధర్మశాస్త్రస్య ప్రయోజనం అనుసృత్య వయం తస్య దివసస్య విశేషానుసారం దేవపర్వం ఆచరామః.
వైదిక సనాతనధర్మానుసారం నిర్మితస్య విధాతుః బ్రహ్మకాలస్య స్మరణార్థం సంకల్పే ఋషిభిః ఉక్తం పారంపరికం తిథిం అనుసరామః.
పాశ్చాత్యవైజ్ఞానికైః మూర్తిపూజకైః చ దత్తానాం క్షణికతిథినాం అనుసరణం కుర్మః .
రూఢివాదీ వైదికధర్మస్య కిం కిం అత్యావశ్యకం, కిం ఆదర్శం, కిం కల్యాణం ప్రవర్ధయతి ఇతి చింతయతు.
యతః అన్యేషు ధర్మేషు బ్రహ్మా అజ్ఞాతం.
కిం తేషాం విహితకాలస్య ఉపయోగః పూజాయాం ఆవశ్యకం విహాయ అస్మాకం కృతే ఆవశ్యకం?
చింతయతు
Comments
Post a Comment