పంచ మహాపురుష లక్షణాధ్యాయము
ఉచిత జ్యోతిష విద్యా పాఠాలు: 87 పంచ మహాపురుష లక్షణాధ్యాయము : ఇప్పుడు నేను పంచ మహాపురుష లక్షణములు చెప్పబడుచున్నది. బలవంతులు, స్వక్షేత్ర, ఉచ్చస్థులైన కుజాది పంచగ్రహములు కేంద్రగతములైన క్రమముగా రుచక, భద్ర, హంస, మాలవ్య, శశకయోగములందు పుట్టినవారు మహాపురుషులు. రుచక యోగ లక్షణములు రుచక యోగోత్పన్నుడైన పురుషుడు ఎక్కువ ఉత్సాహము కలవాడు, నిర్మల కాంతి, పొడవైన ముఖము, సుందరమైన కనుబొమలు, నల్లని జుట్టు, యుద్ధ ప్రేమ, సుందర వస్తువు అందభిరుచి, ఎరుపు నలుపు రంగు, క్రూరస్వభావము కలవాడు, రాజు, వివేకి, సన్నని కళ్లు కలిగిన, దొంగ నాయకుడు, చేతిలోవజ్రము, విల్లు, పాశము, వీణ, చక్రము, వృషభముల రేఖలు కలవాడు, మంత్ర, అభిచార నిపుణుడు, బ్రాహ్మణ భక్తుడు, పొడవుగా 100 అంగుళముల ప్రమాణమున్నవాడు; ముఖము, మధ్యము(నడుము) సమముగా ఉన్న వాడు, తులా సహస్రము బరువున్నవాడు. (100 పలములు 1తుల) వింధ్య సహ్య పర్వతీయ ప్రాంతమును 70 ఏళ్లు పాలించును. చివరన అస్త్రము, లేక అగ్నిద్వారా దేవలోకమునకేగును. భద్రయోగ లక్షణములు భద్ర సంజ్ఞకుడైన మహాపురుషుడు బలిసిన రొమ్ము కలవాడు, సింహసదృశుడు, గజగమనుడు, ఆజాను దీర్ఘబాహుడు, యోగజ్ఞుడు, మంచిగడ్డము, మీసాలు కలవాడు,...