సూర్య సిద్ధాంత గణితంలో తిధులు
సూర్య సిద్ధాంత గణితంలో చేసిన తిధులు ప్రస్తుత కాలానికి సరిపోవటం లేదని ఏ కొలమానంతో తెలుసుకోవాలి? తిధి ఖచ్చితంగా ఇన్ని గంటలకే అయిపోతుంది అని ఆకాశాన్ని చూస్తే ఎలా అర్థమవుతుంది. తిధి ఇన్ని గంటలకు అయిపోతుంది అని గమనించటానికి ఏ గడియారాన్ని మనం ఉపయోగించాలి? మరి భారతీయులు కనుగొన్న తిధి యొక్క అంత్య సమయాన్ని కనుగొనటానికి ఆకాశం వైపు చూసి తిధి ఈ సమయంతో పూర్తి అయినది ఎలా తెలుస్తుంది. ఊహా జ్ఞానంతోనా, లేకపోతే పాశ్చాత్య నిర్మిత డిజిటల్ క్లాక్ తో నా. పాశ్చాత్య పండితులు అందించిన అణువులతో కొలువబడుతున్న కాలాన్ని డిజిటల్ క్లాక్ తో సమయాన్ని తెలుసుకుంటూ ఇప్పుడు మనం జీవనాన్ని కొనసాగిస్తున్నాం. అణు కాలాన్ని కొలిచే విధానాన్ని భారతీయ ఋషులు రాసిన గ్రంథాలలో దీని గురించి చెప్పలేదు కదా. ఏ కాలానికి ఏ గడియారాలు వాడాలో సిద్ధాంతంలో చెప్పలేదుగా. సిద్ధాంతంలో చెప్పిన కాలసాధనతో సాధించిన సమయాన్ని మనం తీసుకోవాలి కదా. దీనిని ఏ విధంగా సామన్వయం చేయాలి. ప్రస్తుతం ఎదురవుతున్న సమస్య. మన భారతీయ ఋషులు మనకు అందించిన ప్రాచీన గ్రంథాల ద్వారా వచ్చిన తిథి అంత్య సమయాన్ని, ...