Posts

Showing posts from October, 2024

సూర్య సిద్ధాంత గణితంలో తిధులు

 సూర్య సిద్ధాంత  గణితంలో చేసిన తిధులు ప్రస్తుత కాలానికి సరిపోవటం లేదని ఏ కొలమానంతో తెలుసుకోవాలి? తిధి ఖచ్చితంగా ఇన్ని గంటలకే అయిపోతుంది అని ఆకాశాన్ని చూస్తే ఎలా అర్థమవుతుంది. తిధి ఇన్ని గంటలకు అయిపోతుంది అని గమనించటానికి ఏ గడియారాన్ని మనం ఉపయోగించాలి?  మరి భారతీయులు కనుగొన్న తిధి యొక్క అంత్య సమయాన్ని కనుగొనటానికి ఆకాశం వైపు చూసి తిధి ఈ సమయంతో పూర్తి అయినది  ఎలా తెలుస్తుంది. ఊహా జ్ఞానంతోనా, లేకపోతే  పాశ్చాత్య నిర్మిత డిజిటల్ క్లాక్ తో నా.   పాశ్చాత్య పండితులు అందించిన అణువులతో కొలువబడుతున్న కాలాన్ని డిజిటల్ క్లాక్ తో సమయాన్ని తెలుసుకుంటూ ఇప్పుడు మనం జీవనాన్ని కొనసాగిస్తున్నాం. అణు కాలాన్ని కొలిచే విధానాన్ని భారతీయ ఋషులు రాసిన గ్రంథాలలో దీని గురించి చెప్పలేదు కదా.  ఏ కాలానికి ఏ గడియారాలు వాడాలో సిద్ధాంతంలో చెప్పలేదుగా. సిద్ధాంతంలో చెప్పిన కాలసాధనతో సాధించిన  సమయాన్ని మనం తీసుకోవాలి కదా. దీనిని ఏ విధంగా సామన్వయం చేయాలి. ప్రస్తుతం ఎదురవుతున్న సమస్య.  మన భారతీయ ఋషులు మనకు అందించిన ప్రాచీన గ్రంథాల  ద్వారా వచ్చిన తిథి అంత్య సమయాన్ని, ...

సూర్య సిద్ధాంత పాఠం

 సూర్య సిద్ధాంత పాఠం ✍️డా.శంకరమంచి శివ సిద్ధాంతి గత పాఠంలో గ్రహాల యొక్క మధ్యమ స్పుటాన్ని గణితం చేశాం ఈ పాఠంలో శ్లోకం 54 లో గ్రహముల యొక్క శీఘ్రోచ్ఛ మందోచ్ఛ పాత యొక్క స్ఫటాలను కనుక్కుంటాం . శ్లోకం 55లో ప్రస్తుత సంవత్సర నామాన్ని కనుక్కుంటాం. ఇక్కడ సంవత్సర నామాన్ని బారహస్పతిమానంలోనే గణితం చేయడం జరుగుతుంది. అంటే బృహస్పతి గతిని ఆధారం చేసుకుని గురు పరిభ్రమణానికి 12 హెచ్చించి వచ్చిన దాన్ని అరవై చే భాగించగా శేషము విజయదిగా ప్రస్తుత సంవత్సరమవుతుంది. 56వ శ్లోకంలో ఈ మధ్యమస్పుటాలను కలియుగాదిగా  గణితం చేసే విధానాన్ని భగవానులు చెబుతారు.  57వ శ్లోకంలో కృతయుగాంతానికి గ్రహ మధ్యమస్పుటాలు 0 డిగ్రీల వద్ద ఉన్నాయి అని భగవానులు మనకి చెబుతారు. ఈ గణితమే చాలా కీలకంగా ఉంటుంది. దృక్కువారైనా సూర్య సిద్ధాంతం ద్వారా చేసిన మరి ఏ గ్రంథం ద్వారా చేసిన కృతయుగాంతానికి గ్రహ మధ్యమస్ఫుటాలు  సున్నా వద్ద ఉన్నాయి అని గణితం పరంగా నిరూపణ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అది రానిపక్షంలో  చేసే గణితము తప్పు అని భావించాలి. 58వ శ్లోకంలో కృతయుగా అంతానికి గ్రహమందోచ్చలు పాతలు ఏ విధంగా ఉన్నాయో చెప్పారు. 59 వ శ్లోకంలో భూమి యొక...

వాస్తవిక దృక్

దీనినే వాస్తవిక దృక్ అంటారు. ఇది మోడ్రన్ సైన్స్ ద్వారానే సాధ్యమవుతుంది. Stellarium app లో ఈ విషయాలు ఉన్నాయి అండి. ఇందులో కన్యా రాశి వద్ద తోకచుక్క ఉన్నది గమనించండి. ఇవి వాస్తవిక ఖగోళంలో కంటికి కనపడే దృశ్యాలు. వాస్తవిక ఖగోళాన్ని   టెలిస్కోప్ ద్వారా గమనిస్తే గణితసంస్కారాలు స్పష్టంగా అర్థం అవుతాయి. టెలిస్కోప్ దగ్గర లేని వారికి నాసా వారు ఇస్తున్న డేటా ద్వారా పనిచేస్తున్న ఈ యాప్స్ బాగా మనకి సత్యాన్ని, వాస్తవికతను తెలియజేస్తాయి.అండి Spica= చిత్త Arcturus=స్వాతి

శాలివాహన శక సంవత్సరం and సూర్యసిద్ధాంతం

 శాలివాహన శక సంవత్సరం అంటే ఏమిటి  భారత ప్రభుత్వం శాలివాహన శక సంవత్సరం ఎందుకు వాడుతోంది.  శాలివాహన శకం ఏ నెలలో ఏ తేదీ నుండి మొదలవుతుంది.   ఆ తేదీకున్న ప్రాధాన్యత ఏమిటి  సూర్య సిద్ధాంతంలో దాన్ని ఏమని పిలుస్తారు.  సౌరమానం అంటే ఏమిటి సౌరమానం ఎన్ని విధాలుగా ఉంది. ఈ విషయాలు తెలుసుకుంటే దృక్ అంటే ఏమిటో అర్థం అవుతుంది. సూర్యసిద్ధాంతం  అహర్గణ పాఠం , గ్రహ మధ్యమ స్ఫుటములు .  ✍️డా.శంకరమంచి శివ సిద్ధాంతి అహర్గణ గణితం :   శ్లోకం 50: 49 వ శ్లోకంలో వచ్చిన అహర్గణ  సంఖ్యలో నుండి క్షయ తిథులతో హెచ్చించి మహాయుగీయ చంద్ర తిథులతో భాగిస్తే మనకు ఎన్ని  క్షయ తిథులు గడిచాయో వస్తాయి . ఇప్పుడు ఈ  గడిచిన  క్షయ తిథులను 49 వ శ్లోకంలో వచ్చిన అహర్గణ  సంఖ్యలో నుండి తీసివేస్తే సృష్ట్యాది అహర్గణ వస్తుంది .  శ్లోకం 51: వారధిపతిని గణితం చేయటం :  సృష్ట్యాది అహర్గణను 7 చేత భాగించగా వచ్చిన  శేషం వారధిపతిని తెలియచేస్తుంది  . శేషం 1 వస్తే ఆదివారం , 2 వస్తే సోమవారం , 3 వస్తే మంగళవారం , 4 వస్తే బుధవారం , 5 వస్తే గురువారం , 6 వస్తే శుక...