ఆయుర్దాయాధ్యాయము :
ఆయుర్దాయాధ్యాయము : నరుల ఆయుర్దాయ జ్ఞానము దేవతల కైనా దుర్లభమైనది. అనేక మునులు అనేక విధములుగా చెప్పిన ఆయుర్దాయ సారము. రవ్యాది గ్రహములు తమతమ ఉచ్చ నీచాదిరాశివశమున ఆయుర్దాయము నిస్తారు. పిండాయుర్దాయము: అశ్విన్యాది నక్షత్రములు, మేషాదిరాశుల బలానుసారముగా 1. రవ్యాదిగ్రహములు తమతమ ఉచ్చరాశులందున్నప్పుడు క్రమముగా రవి19, చంద్ర25, కుజ15, బుధ12, గురు15, శుక్ర21, శని20 సంవత్సరములు. 2. నీచలో ఉన్నపుడు అందులో సగమును, 3. మధ్యలో నున్నపుడు అనుపాత ప్రకారమును ఆయుర్దాయము నెరుగవలెను. 4. ఏ గ్రహముయొక్క ఆయుః ప్రమాణము తెలియవలెనో దాని రాశ్యాదిలో ఉచ్చరాశ్యాదిని తీసివేసి, మిగిలిన రాశ్యాదిని పైన పిండాయువుచే గుణించగా వికలవరకు రాశ్యాదిని సవర్ణముచేసిన ఆగ్రహముయొక్క భగణాదిగా వర్షాది ఆయుర్దాయమువచ్చును. 5. ఉచ్చరశ్యాదినుండి తీసివేసినపుడు శేషము ఆరు రాశులకన్నా తక్కువయైన పన్నెండురాశులనుండి తీసివేయవలెను. సంస్కార విశేషము: 1. అస్తంగత గ్రహమునకు వచ్చిన ఆయువులో సగము తీసివేయవలెను. 2. శని శుక్రులు అస్తంగతులైనా, తీసివేయనక్కరలేదు. 3. శత్రుక్షేత్రవర్తియైన, ...